పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మండలంలో కీర్తిశేషులు పాలంకి నారప్ప, రావూరి సూరయ్య, వేదూ బావయ్య, భాగవతుల కోనయ్య, కాశీనాధభట్ల వెంకయ్య మొదలగు వారు కూడా ప్రసిద్ధులు. సోమయాజులు వేషానికి కోనసీమ వేద పండితులచే కాశీనాధభట్ల వెంకయ్యగారు జోడు శాలులు బహుమానము నందిన ఘనుడు.

  ఈ పగటివేషాలలోని ప్రక్రియ ముఖ్యంగా వేషంలో, భాషలో, నడకల్లో, చేష్టల్లో లోకంలోని కొందరిని అనుకరించడం, అదికూడా గుర్తు పట్టలేనంత గొప్పగా ఆరూపంలో అతుక్కుపోవడమే దీనిలోని ప్రత్యేకత. ఇది పూర్తి పరకాయ ప్రవేశం.  ముఖ్యంగా ఆయా వేషాలద్వారా సామాన్యులకి సంఘంలో దురాచారాల్ని గిలిగింతలుపెట్టే హాస్యంతో వ్యంగ్యంగా ఎత్తిచూపించడం యిందులోని మౌలిక సూత్రం.  వినోదం, విజ్ఞానం బహిప్రాణాలు.  ఈ వేషాలు మగవాళ్ళే వేస్తారు.  ఇవి 32 వీనిలో పోలీసులు, పఠాన్లు, బుడబుక్కలు, లంబాడీలు, బోడెమ్మలు, సోమయాజులు - సోమెదేవమ్మ, భట్రాజులు, గొల్లభాయిడు, పిట్టల దొర, ఫకీర్లు, మాదిగ, కారువాసాని - సోమయాజులు, మందులవాల్లు, సాతాని వైష్ణవులు, సాధువులు, బాల్కీ - బైరాగి, సిద్ధి - కంచెనీ, అర్ధనారీశ్వర, శక్తి, భేతాళ, దేవరపిట్టి మొదరగునవి సుప్రసిద్ధి వేషాలు.
                      పో లీ సు లు
     ఇది సాధారణంగా తొలిరోజు ఉదయం ఇచ్చే ప్రదర్శన.  ఒకసారి ఓ గ్రామంలో ఒక స్త్రీ ఊరావల చెరువులోపడి ఆత్మహత్య చేసుకుంటే ఆమెను పైకితీసి వెంటనే రాత్రికిరాత్రి దహనంచేసేసేరట. దీనిపై పోలీసురిపోర్టుఇవ్వవలసిన మునసబుగారు రిపోర్టు ఇవ్వలేదట.
    మరుసటిరోజు తెలతెలవారుతుండగా నలుగురు కానిస్టేబుల్సూ, ఒక ఇనస్పెక్టరూవచ్చి కచేరె చాఫ్వడిలోకూర్చుని మునసబుగారికి కబురు చేశారట.  ఆయన వచ్చి నమస్కారంచేసినిలబడితే ఆత్మహత్యచేసుకొన్న స్త్రీ విషయమై ఆచూకికి వచ్చామనీ ఎందుకు రిపోర్టువ్వలేదనీ గద్దించేసరికి మునసబు వణికిపోతూ బ్రతిమలాడుకుంటుంటే, కరణం వచ్చి కానిస్టేబుల్సుని ప్రక్కకుపిల్చి డబ్బుకుబేరంమాడడం ప్రారంభించాడాట.  ఈ అడావిడికి గ్రామస్థులందరూ అక్కడికి చేరిపోయారు.  కధ మంచి