పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోయిలో కడుపులోని ప్రేగులు బయటికివచ్చి గిలగిల కొట్టుకొంటున్న కుర్రాణ్ణి వెంటబెట్టుకుని ఒకాయన వచ్చి, బాబూ బాబూ డాక్టరుగారూ! కుర్రోణ్ణి బ్రతికించండని ప్రార్ధించేడట. డాక్టరుగారు ఆ అబ్బాయి పొట్టా,ప్రేగులూ చూసి వెంటనే అతనిని జనరల్ హాస్పిటల్ కు తీసికెళ్ళండని అన్నాడట. ఆబాబు అక్కడికక్కడే మరణిస్తాడేమోఅని అహోబలరావుగారు కంగారు పడుతున్నారు. కుర్రవాడి బంధువులు లబోదిబోమని ఏడుస్తున్నారు. మాంత్రికవేషంలోనున్న ఒకవ్యక్తి జనంలోంచివచ్చి మంత్రించి ప్రేగులుతీసేసి పొట్ట సర్దేశాడు. అప్పటిదాకా చావుబ్రతుకుల్లోఉన్న ఆఅబ్బాయి లేచికూర్చున్నాడట. అంతా నివ్వెరపోయారట. ఇంతకీ యీ అద్బుతమాంత్రికుడెవరయ్యా అంటే సున్నం వీరయ్యగారు. తరువాత ఆ కుర్రవాని పొట్ట పరీక్షించి చూస్తే అరటిగుజ్జు. బొంద, పువ్వు ఎర్ర రంగులో కలిపితే పొట్ట, ప్రేగులు ఏర్పడ్డాయని తేలింది. వీరయ్యగారి పగటి వేషాలు అంత స్వాభావికంగా ఉండేవి.

  *”కష్టాతికష్టమగు యీ విద్య ఆంద్రదేశమందు కూచిపూడి బ్రాహ్మణ వంశములలో తొలుత నవతరించిందంటారు. తరువాత గోదావరిమండలమందలి కాకరపర్రుగ్రామమావిద్యకు గురుకులమైనది. ఆరెండు చోట్లను సుశిక్షితులైనవారే యావదాంద్ర దేశాన దమ విద్యను ప్రదర్శించి గ్రామాదులచేతను, పౌరులచేతను, మహారాజుకచేతను ఆదరమును బడయగల్గిరి“.
  ప్రస్తుతం యీకళను ఆరాధిస్తున్న ప్రసిద్దులలో రాజమహేంద్రవరంలో ఉంటున్న విభూతి భ్వానీలింగంగారొకరు. సంగీతం, సాహిత్యం, నటన నాట్యకళలో ప్రవీణులేగాక శిష్యులను తయారుచేస్తూ తమ దళంతో ఊరూరా ప్రదర్శనలిస్తున్నారు. వీరి అర్ధనారీశ్వర, బోడెమ్మ వేషాలు చూసితీరవలసిందే. మొదట భాగవతులలో వృత్తిగా బ్రాహ్మణులే ఈ వేషాలు వేసినా, క్రమంగా విశ్వబ్రాహ్మణులు, జంగందేవరలుకూడా దీనినభ్యసించారు. గోదావరి

__________________________________________________________

  • విజ్ఞాన సర్వస్వము _ సంసృతి పు.915. వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు