పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముగ్గురుదొరలకు ఒకటే టోపి (తాటిపందు)
గుడినిండా ముత్యాలు, గుడికి తాళం (దానిమ్మపండు)
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది (ఈతచెట్టు)
అడవిలో ఆంబోతు రంకేసింది (గొడ్డలి)
అమారాదేశంనుంచి కోమారావళ్లేగాని
తినేవాళ్ళులేరు (వగడాలు)
అంబారిమీద కుంబారీ
కుంబారీమీద కుడితిగోలెం
కుడితి గోలెంమీద బూర
బూరమీద డబ్బా
డబ్బామీద పీచు
పీచులో ముత్యాలు (పేలు)
దేవుడిగుడితలుపులు వేసేవారేగాని తీసేవారులేరు (వెల్ల)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది
మాయింటికొచ్చింది, తైతెక్కలాడింది (చల్లకవ్వం)
పనసపండుతెచ్చి పళ్ళెంలో పెడితే
తినలేని బ్రాహ్మడు దిక్కులు చూసేడట (పుస్తకం)

ఈపొడుపు కధలలో ఒక విచిత్రము కూడా ఉంది. ఒకరు కధ పొడుస్తారు. రెండవ వారు అది విప్పాలి. విప్పలేకుంటే ప్రతిగా వారొక కధ పొడవాలి, అది మొదటివారు విప్పాలి. అది అతను చెప్పలేకుంటే ఇరువురూ అవరికధ వారు విప్పి చెప్పాలి. ఎదుటివరు విప్పలెని కధలు ఎవరెన్ని పొడిస్తే వారుమేటిగా లెక్క. ఆలొచనాశక్తిని రేకెత్తించే విజ్ఞానపు ఆట- మెదడుకు నిండా మేత.

  • "Riddles are questions that are framed with the purpose of confusing or testing the wits of those who do not know the answers.

(Roger D. Abrahams, Alan Dunder, Folk lore and Folk life. Ridhard M.Dorsen) (EDP. 130)


  • (ఆంధ్ర జానపద విజ్ఞానం పు.215