పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సా మె త లు

జీవితాన్ని వడకట్టిక అనుభవలు సామెతలు. జానపదులకు సూక్ష్మంగా పాఠాలు నేర్పుతాయి. అల్పాక్షరాలలో అనల్పార్ధ రచయిది. ఆలోచిస్తే యిదే మినీకవిత. శ్రోతల్ని యిట్టే ఆకట్టుకుంటాయి. ఇవి మన నీతులు, ఆచారాలు, వ్యక్తులు, వృత్తులు, సంసారం, వైద్యం, విద్య, కళలు, మతం, నమ్మకాలు, కులం, ఆహారం, వ్యవహారం, వాతావరణం, పరిపాలన, వినోదాలపై సంక్షిప్తంగా పలుకబడ్డ ఉక్తులు, జాతీయాలు, నానుడులు, జనశృతులు వీనిలో కోకొల్లలు, సందేశాలు చాలా సూతిగా అందిస్తాయి హృదయానికి హత్తుకొనేలాగ, ప్రసన్నత దీనికి ప్రాణం. ఎదుటివారి అభిప్రాయాన్ని సమర్ధించడానికిగాని,ఖండించడానికిగాని సామెతలు ఆటంబాంబుల్లా పనిచేస్తాయి. ధ్వని ప్రధానం- ఉపమాలంకరంతోనో, రూపకాలంకారంతోనో, అర్ధాంతర వ్యాసాలంకారం తోనో స్వభావోక్తులతొనో చెప్పబడి సులభగ్రాహ్యంగా ఉంటాయి సామెతనే సామ్యం అంటారు. మనవాళ్లు మటాడేటప్పుడు ఊతగా సామ్యం చెప్పినట్టు అంటుంటారు. సామెత చెప్పినట్టు అనిదానర్ధం.

  • "Proverbs are short and witty traditional expression that arise as part of every day discourse as well as in the more highly structured situations of Education and Judicial proceedings. Roger (D Abrahams Folk Lore and Folk Life Richard M.Dorsen (ED)P. 119).

"A proverb is a remnant from old philosophy preserve amidst countless destructions by reason of its brevity and fitness for use. ---ARITOSTLE

"Short sentences drawn from Long Experiences" --Cervantas


  • డా. ఆర్. వి. యస్. సుందరంగారి "ఆంధ్రుల జానపద విజ్ఞానం" పుట-198 నుండి గ్రహించబదినవి.