పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సహస్రశిరచ్చేద అపూర్ఫచింతామణి కధలు ఈ కొవలోనే. నిజానికి జానపద సాహిత్యంలో ముద్రణాయోగంపొందినవానిలో అదికభాగం యీ వచన కధలే.

పిల్లలు వృద్ధులదగ్గచే- ఊకొడుతూ యీకధలు చెప్పించుకుని వినోదిస్తూంటారు. వర్షాకాలంలో విద్యాగంధంలేనివయోజనులుకూడా అరుగులమీదకూర్చుని ఒకరు కధలు చెబుతుంటే ఒకరూఊకొడుతూ ఆనందాశ్చర్యాలతొ రోజులతరబడి వింటుంటారు. చెప్పేవారి నేర్పుమీద ఆధారపడి వుంటుంది ఈ కధల ఆకర్షణ.

                        పొ ట్టి  క ధ లు

వచనంలో చిన్నపిల్లలకుచెప్పే 'కాకి-నక్క ' లాంటి కధలు తెలుగ్తు జానపదవాజ్మయంలో ప్రత్యెకతగన్నవి, వీనిలో ఎన్నో నీతులు ఉంటాయి. పొగడ్తలకు పొంగిపోరాదనే నీతి 'కాకి-నక్క ' కధలోను, బలవంతులు బలహీనులనెలా కబిళిస్తారో అనేది 'తోడేలు - మేకపిల్ల ' కధలోను, ఊరకే అపకారంచేస్తే కలిగే అనర్ధాలు "రాజు-ఏడుగురు కొడుకులు" కధలోను ఇమిడ్చే చిట్టిపొట్తి పాపల మనస్సులను హత్తుకొనెలా చెబితే, వారు విజ్ఞలుగా తయారుకావచ్చుననే వీని అంతరార్ధం. అలాంటివే 'బాతు-బంగారుగుడ్దు", 'కట్టెలమ్మేవాదు-గొడ్డలి ' కధలు కూడా, మార్గకవిత్వంలో బంధకవిత్వం, చిత్ర కఫ్విత్వంలాంటిదే పొడుపు కధల ప్రక్రియ. వీనిని సంస్కృతంలో ప్రహెళికలంటారు. ఇవి చమత్కారానికి ఆటపట్టులు, బుద్దికి పదునుపెడతాయి. మనసుని వికసింపజేస్తాయి. వినొదాన్నీ, విజ్ఞానాన్నీ అందిస్తాయి.

"గోడమీదబొమ్మ గొలుసులబొమ్మ
  వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ" (తేలు)
 'దిబదిబమన్నాయి రెండు, దిబ్బెక్కి చూసినవి రెండు,
 ఆలకించినవి రెండు, అంది పుచ్చుకున్నాయి రెండు '.
                          (కాళ్లు, కళ్లు, చెవులు, చేతులు)
చిటారుకొమ్మన మిఠాయి పొట్లం (తేనెపట్టు)
పచ్చనిచెట్టుమీద పిచ్చుక సమర్తాడించి (పండు మిరపకాయ)