పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • కధా గేయాలు యీ క్రింది పది లక్షణములు కలిగియుండును.

1. గేయ రూపంలో ఉంటుంది
2. అజ్ఞాత రూపంలో ఉంటుంది.
3. గాయక భిక్షువుల ఆశుకవితగా జీవిస్తుంది.
4. వాగ్రూపమైన ప్రచారం కలిగివుంటుంది.
5. కవిత్వం వస్తునిష్ఠం (objective poetry)
6. బాష, భావం సరళంగా ఉంటాయి. కొన్ని పదాలు
          వర్ణనలు పునరుక్త మౌతుంటాయి.
7. ఒక కవి కర్తృత్వం కావు. ప్రజల్లో సహజంగా
        జనిస్తాయి
8. వివిధ ప్రాంతాలలో వివిధ విధాలుగా కనిపించినా
    వీని అన్నిటికీ ఏకసూత్రత ఉంటుంది.
9. నీతి వచ్యంగాచెప్పక భంగ్యంతరంగా చెబుతుంది.
       విధి బలీయమన్న నీతిని చెబుతుంది.

10. ప్రతి జీవికి చివర ఓటమి ఉన్నదనే విషాద విష
       యాన్ని ప్రతిధ్వనిస్తుంటాయి".

                            జానపద వచనకధలు

ఇవి పూర్తిగా కట్టుకధలు. వీనిలోని సన్నివేశాలు భూలోకానికె కాకుండా స్వర్గలోకం, పాతాళలోకాలలోకి కూడా పాకిఉంటాయి వీనిలో రాజకుమారులు, రాజకుమార్తెలు, వీరులు, మాంత్రికులు రాక్షసులు, పిశాచాలు, పోరాటాలు, సాహసకృత్యాలు, మంత్రతంత్రాలు మొదలగునవి కలిగిఉంటాయి. వినోదం ప్రధానం, అద్భుత, వీర, శృంగార రసాలు వీనిలో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, వీరుడైన కధానాయకుడిగెలుపు ధ్యేయంగా ముగుస్తాయి. సాధారణంగా 'అనగనగా ' అని మొదలు పెట్టబడి 'కధకంచికి వెళ్ళింది, మనం ఇంటికి వెళదాం ' తో ముగుస్తాయి. పరమానందయ్యశిష్యుల కధలు, తెనాలి రామకృష్ణుడు కధలు, కాశీ మజిలీ కధలు, భట్టీనిక్రమార్క కధలు, పేదరాశి పెద్దమ్మ కధలు, గులెబకావళి కధలు, మదనకామరాజు కధలు,


           * డా||తంగిరాల సుబ్బారావు 1975 24 : 26