పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెట్టును నమ్మీ ఏలేలో
కొమ్మా ఉన్నది -హైలెస్సా
కొమ్మను నమ్మీ ఏలేలో
రెమ్మా ఉన్నది - హైలెస్సా
రెమ్మను నమ్మీ ఏలేలో
పువ్వూ ఉన్నది - హైలెస్సా
పువ్వును నమ్మీ ఏలేలో
పిందీ ఉన్నది - హైలెస్సా
పిందెను నమ్మీ ఏలేలో
పండూ ఉన్నది - హైలెస్సా
పండును నమ్మీ ఏలేలో
నెనున్నాను - హైలెస్సా
వంటి పాటలు పాడుతూ ముందుకు లాగుతుంటేపాడేవాళ్ళమాటటుంచి వినేవాళ్లుకూడా చూస్తూ ఏదో ఆనందం పొందుతుంటారు.

                             శృంగార గీతాలు

             *ధర శృంగారము, హాస్యము,
               కరుణయు, వీరము, భయానకము, భీభత్సం,
               బురు, రౌద్ర, మద్భుతము, శాం
               తరసంబును, రసమ్లనగ దనరుం గృతులన్"
 

శృంగార, హాస్య, కరుణ, వీర, భయానక, భీభత్సం, రౌద్ర, అద్భుత, శాంతములనునవి తొమ్మిది రసములు.

భోజుడు 'శృంగార ఏవ ఏకోరస: (శృంగారమొక్కటే రసము) అని సిద్దాంతీకరించాడు. నిజానికి ఇది రాజరసము - ప్రాణికోటి సృష్టి అంతా దీని మీదే ఆధారపడి ఉంది.


  • కవ్యాలంకార సంగ్రహము పు 291