పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
    • “శృంగారమనగా మన్మద్బోధకము (కామోద్రేకము), దానిని కలిగించడానికి కారణమైన ప్రకృతుతులచే విస్తరెంచే దానిని శృంగారమందురు అని విశ్వనాధకవిరాజు పేర్కొనెను“. ఈ ప్రకృతులలో శృంగారానికి పెద్ద పీటే వేశారు. వారి పాటలలో చాలాచోట్ల ఇదికొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పల్లెటూళ్ళలో యువకులు కోలాట మేస్తూ.

“తయ్యక్కడతాజమతా
ఓ చిన్నదానా విడువనె కొంగు
మరొదలని కొంగు
చారడేసికళ్ళదాన
సంపెంగీముక్కుదాన
పసిమీవన్నెల దాన
పసిడిబుగ్గల దాన
తెల్లని పలువరుస దాన
తేనెతేట లొలుకుదాన
హంసానడకల దాన
అందమైననడుము దాన
ఓచిన్నదానా విడువనె కొంగు -
సన్నా సన్నాని దాన
సన్నాని కురుల దాన
సన్నాని కురులమీద
జాజి గుత్తుసోకే
ఓచిన్నదానా విడువనే కొంగు.
బందరు చిన్నదాన
బజా బందూల దాన
బాజా బందూలమీద
మోజేల లేదే!
ఓ చిన్నదాన, విడువనె కొంగు -
గుంటూరు చిన్నదాన
గుండ్రాని కళ్ళదాన
_______________________________________________________

    • ’రూపకళ ‘ (శ్రీ సహదేవ సూర్యప్రకాశరావు) పు.165 నుండి