పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రమ జీవుల పాటలు

'ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నది"
శ్రమజీవులు త్రాముచెస్తున్నపనిలోని కష్టాన్ని మరిచిపోవదానికి పాడే పల్లెపదాలు అనేకరాలు.

"గోదారీ తల్లీకి గొజ్జంగీ పూదండా" అని పాడుకుంటూ పడవలాగే వాళ్ళు ఆయాసం తెలియకుండా రాత్రింబవళ్ళు పడవతాడు లాగుతునే ఉంటారు. పొలంపనుల్లో వరినాట్లు, కోతలు, కుప్పనూర్పుళ్ళలో పొలియోసాలీ పొలియొసాలీ రావేలుగలవాడా రారా పొలిగాడా" వంటి ఉత్సాహజనకమైన పాటలు--
              "శివ శివ యనమెలు తుమ్మెదా
                శివ యంటేనె వినమేలు తుమ్మెదా"

అనితుమ్మెదపదాలు, వెన్నెలపదాలు రైతుకూలీలు పరవశంగా పాడుతుంటే పాటతోబాటు పనికూడా వేగంపుంజుకుంటుంది. రోడ్డు రోలరు లాగే కూలీలు కోరస్ గా-

"జంభైలే సోకు లంగరి
  రోలా కాదు బరువురాయి
  లాగానోడికి బుద్దీ లేదు
  లాగే వోడే దేవుడయ్యా
  సిగ్గూలేదు దుక్కా జనులు
  రోషంలేదా మీసం లేదా
  అయిలపట్టు బల్లకట్టు
 అద్దిరబాబూ అక్కడ పట్టు" అనే పాట.

"జాలిలో ఓ జాలి బెల్లా - జాలిబాంబేలా
  అన్నలారా తమ్ములారా - జాలిబాంబేలా
  అందమైనా శూరులారా - జాలిబాంబేలా
  శూరమాత భేరి మాత - జాలిబాంబేలా
  నూగునూగు మీసగాళ్ళు - జాలిబాంబే