పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాకినిచూస్తే మగపిల్లలు--
కాకీకాకీ కడవల కాకీ
కాకిని తీసుకెళ్ళి గంగలో ముంచ
గంగా నాకూ గందామిచ్చె
గంధం తీసుకెళ్ళి ఆవుకు రాస్తే
ఆవూ నాకూ పాలూ ఇచ్చే
పాలూ తీకికేళ్ళి అమ్మాకిస్తే
అమ్మా నాకూ పాయస మిచ్చే
పాయసం తీసికెళ్ళి మామాకిస్తే
మామా నాకూ పిల్ల నిచ్చే
పిల్లాపేరు మల్లెమొగ్గ
నాపేరు జమిందార్"-
అంటూ ఇలా తమఆధిక్యతని తామే పెంచుకుంటూ మంచిహుషారుగా పాడాతారు.
పిల్లలు ఒకర్ని పరోక్షంలో మరొకరు ఏమన్నాఅంటే విన్నవారిలో ఎవరైనా ఆవ్య్హక్తికదిచెప్పేస్తానంటే ఉక్రోషంవచ్చేసి కోపంతో-
"చెప్పుకో చెప్పుకో చెప్పుచ్చుక్కొట్టుకో
  మామిడాకుతెచ్చుకో మందేస్తాను
  ఈతాకుతెచ్చుకో ఇల్లు కడతాను
  తాటాకు తెక్కుకో తగలేస్తాను"
అనే గేయరూపంలో అదిరిస్తూ కరిలిస్తారు.

సాయంత్రం సమయాల్లో చల్లబాటు వేళల్లోనూ, రాత్రి వెన్నెల్లోనూ చిన్న పిల్లలు ఒకచోటిచేరి వీధుల్లో తమచు ట్టూ తాము గిర్రున తిరుగుతూ కృష్ణుడిమీద-

"తారంగం తారంగం తాండవ కృష్ణా తరంగం
  వేణూనాధా తారంగం వెంకట రమణా తారంగం" అనీ,
ఏనుగుమీద -
"ఏనుగొచ్చిందేనుగు, ఏవూరొచ్చిందేనుగు
  మావూరొచ్చిందేనుగు, మంచినీళ్ళు తాగిందేనుగు"అనీ,