పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిల్లలు ఎవరినైనా అభినందించాలనుకుంటే ప్రాస క్రీడలతో మంచి మజాగా అభినందిస్తారు యిలాగ-

"రాజా నా రాజా
  నా రాజ నిమ్మల పండు
  అప్పారావు కొండ
  నేతి మిఠాయుండ" అని.
పిట్టలు వాళ్ళలోవాళ్ళు పందాలువేసుకొని పరుగులెడుతుంటారు. ఆ పరుగులో అవరైనా పడిపోయినప్పుడు కాలికి దెబ్బ తగిలితే ఇలా పాడుతారు కోరస్ లా_
"కొండ మీద వెండిగిన్నె
  కొక్కిరాయి కాలు విరిగె
  దానికేమి మందు
  వేపాకు చేదు
  వెల్లుల్లి గడ్డ
  నూనమ్మ బొడ్డు
  నూటొక్క ధార
  పొయ్యి పొయ్యి నూరి
  పూట కొక్క తూరి" అని.
ఇందులో దెబ్బకు మందేదో చెప్పబడిందన్నమాట.
పిల్లల్నిచూస్తే పిల్లలఆనందం పట్టనలవికాదు. పాటలువాటికవే పొంగి పొర్లి వస్తాయి.
గువ్వ కనిపిస్తే--
"గువ్వా గూడెక్కి
  రాజా మేడెక్కి" అని పాడతారు.
చిలకను చూస్తే-
చిలుకచిలుక రామచిలుక పలుకనన్నది.
అత్తతెచ్చిన కొత్తకోక కట్టనన్నది
మామతెచ్చిన మల్లెమొగ్గ ముడువనన్నది
మొడుడిచేతమొట్టికాయ తింటానన్నది ' అని పాటపాడుతారు