పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక ఊళ్ళో ఒకబడి నిప్పంటుకుని తగలబడిపోతుంటే విద్యార్ధులంతా బయట బలేసంబరంగా కేరింతలుకొడుతూ గంతులేస్తున్నారట మళ్ళీ కొన్నాళ్ళవరకూబడికెళ్ళక్కరలేదని, కాని అందులో ఒకకుర్రాడు కూర్చునిఏడుస్తున్నాడట. అతనిదగ్గరకెళ్ళి ఎడవకునాయినా మళ్ళీ తొందరగా బడి కట్టించేస్తాంలే అంటే ఆ విధ్యార్ధి "నేను బడి కాలిపోతుందని ఏడవడంలేదు, మామేష్టర్లు బయటుండిపోయేరని ఏడుస్తున్నానన్నాడట. ఇది ఒక జోకే కావచ్చు. కాని పిల్లలు మనస్వత్వాలు బాల్యంలో బడిమీదా, మాస్టర్లమీదాఅలాగుంటాయో హాస్యంగా ఆవిష్కరిస్తుంది.

ఇక వదినిగారి మీద కోపం వస్తే-

"వదినావదినా వల్లంగీట్ట
  గదిలోపెట్ట గోడనేసికొట్ట" అనీ

నారాయణ పేరు గలవాని మీద కోపం వస్తే-
"నారాయణ నారాయణ నక్కతోక
  నారాయణ పెళ్ళాం కుక్కతోక" అనీ
ముసలితాతమీద-
"తాతా పీతా ఉల్లికోళ్ళూతా"
అనే అను ప్రాసలతోనూ,అంత్య ప్రాసలతోనూ అల్లుకు పోతుంటారు. ముసలి తాతను వెక్కిరిస్తూ మరో పాట కూడా ఉంది.
"కూకుంటే లేవలేవు
  కూరాకు తెంపలేవు
  తాతా నీకెందుకురా పెళ్ళము" అని.

సూర్యనారాయణ పేరుగల వానితోగాని, సూరమ్మ పేరుగలవాళ్ళతోగాని విరోధమొస్తే-
"సూరీ సూరీ చుంచెలక
  మాయింటికొస్తే మంచెలుక"
అని పాడతారు, ఇందులో విరోధంలో క్రోధం కనిపిస్తున్నా కలిసిపోదాం రమ్మనే ఆహ్వానం కూడా ఉంది.