పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యిల్ళాళ్ళను చెరుస్తున్న కీచకధములు నేటి కళాకారుని కుంచెనుండి వెలువడవలసిన దృశ్యాలు. శ్రీశ్రీ గారన్నట్లుగా "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చా" నన్నట్టు అప్పుడే కొందరు చిత్రకారులు యీ ఉద్యమానికి అంకితమై కృషి చేస్తుండడం హర్షణీయం.

             జా న ప ద చి త్ర లే ఖ నం

జానపదులలో ముచ్చువారు అనేఒకతెగవారున్నారు. వీరు అమ్మవారి విగ్రహాలను కుంచెలతో, వివిధ రంగులతో ప్రసన్న రూపంగాని, భీకర రూపంగాని, వరద, అభయ ముద్రలలో గాని చూపరులకు అచ్చెరువు కలిగేలా రూపు రేఖలు దిద్దుతారు. వీరి ఏకాగ్రత, పవిత్రత, ఆత్మశుద్ది ఈబొమ్మలను సజీవ మూర్తులుగా చిత్రీకరింపచేస్తాయి.

పెండ్లి సమయాలలో కుమ్మర్లు అవిరేడుకుండలపై వివిధ రంగులతో చిత్రించే బొమ్మలు కూడా జానపద హృదయ రంజక చిత్ర లేఖనాలే.

మనం నిత్యం చూసే చీరల మీద అద్దకాలు (కలంకారీ) పని జానపద చిత్రకారుని కళానిపుణత్రకు అద్దం పడతాయి. అలాగే చీరల నేతలో కరక్కాయంచు, కాకరకాయంచు మామిడి పిందెలు వగైరా అద్భుతంగా రూపొందిస్తారు నేతపనివారు;.

                      "పచ్చబొట్టూ చెరిగీ పోదూలే నారాజా"

అన్నిటినీ మించి జానపదుల పచ్చబొట్టు విచిత్ర చిత్ర లేఖనం. ప్రాచీన కావ్యాలలో కనిపించే మకరికాపత్ర రచన ఇదే. ఈ పచ్చబొట్టు జానపదులు చేతులమీద, కాళ్ళమీద, వీపుమీద, ఆనందంగా పొడిపించుకుంటారు. అందులో సీతారాములు, రాధాకృష్ణులు, గణపతి, ఆంజనేయుడు, వెంకటేశ్వరస్వామివంటి దేవతల బొమ్మలు, కళ్యాణం బొట్టు, ముగ్గులు, చేప, సింహంవంటి ఇష్టమైనబొమ్మలు వేయించుకుంటారు. కొందరు స్త్రీలు తమ భర్తపేరు గాని, శ్రీరాములు అనిగాని పచ్చబొట్టు పొడిపించుకుంటారు. ఈ పచ్చంబొట్టు వాతనొప్పులకు మందుగా కూడా ఉపయోగపడుతుందట. సూదిని మెల్ల మెల్లగా గుచ్చుతూ బొమ్మను గాని, అక్షరాన్ని గాని రూపుదిద్ది దీనికి ఉద్దేశించిన పసరుతో ఆ రంధ్రాల్ని నింపుతారు. కొంతసేపటికి ఆ పసరు లోనికి ఇంకి బొమ్మ పచ్చగా