పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతలూ అనెక వంకరలతో గీస్తాడు. అది హృదయ స్పందనాన్ని తెలుపుతుంది. 'సింబాలిజం ' అంటే ప్రతీక వాదం. ప్రపంచంలో అలవంతులు బలహీనుల్ని ఎలా కబళించి వేస్తున్నారో చెప్పడానికి గోడమీద బల్లిచే తినబడుతున్న పురుగులు వేస్తారు. బల్లి బలవంతునికీ పురుగులు బలహీనులకీ ప్రతీకలు. బొమ్మలు భాష అని మరో రకం పద్దతి వుంది "కొండపిల్లి భాస్కరుడు" అనే వ్యక్తి పేరు వ్రాయడానికి బదులు కొండ, పిల్లి, సూర్యుడు బొమ్మలు వేస్తున్నారు. అన్ని కళలలోలాగే యిందులో కూడా అస్పష్టత చోటు చేసుకున్న చిత్రాలు లేకపోలేదు. అలాంటి వాటిమీద ఒక జోక్ కూడాఫుంది. ఒకాయన బొమ్మగీశాను చూడమన్నాడట. చూసే ఆయన ఏమిటిది? అన్నాడట ఆవు గడ్డి తినడమన్నాడట. గడ్డేది? అన్నాడట. ఆవు తినేసిందన్నాడట. ఆవేది? అన్నాడట. తినేసి వెళ్ళి పోయింది అన్నాడట.

ప్రస్తుతం ఆంధ్ర దేశంలో బాపు, బాలి, చంద్ర, గోలిశివరాం మొదలగు ప్రఖ్యాత చిత్రకారులు త్మ కార్టూన్ లతోనూ, రేఖా చిత్ర్రాలతోనూ చిత్ర గంగాన్ని సుసంఫన్నం చేస్తున్నారు. ఇందులొ బాపూ "స్కూల్ ఆఫ్ ధాట్" ఒక ప్రత్యేక బాణి; అక్షరాలు గుండ్రంగా వ్రాసే దశనుంచి వంకరటింకర అక్షరాల దశకు మళ్ళించి.

ఏ కళ అయినా సమాజానికి అద్ధం పట్టి చూపాలి. సంఘంలో గల అత్యాచారాలు, అనాచారాలు అరికట్టాలంటే దానికి చిత్రలేఖనమే గొప్ప ఆయుధం. ఈనాడు సమాజంలో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. నీతి అవినీతిని వెక్కిరిస్తొంది. ధర్మం అధర్మానికి దచణ్ణం పెడుతోంది. వినాయకులు పందికొక్కులై గారి క్రిందే మెక్కేస్తున్నారు. ఈ అన్యాయాలూ, అక్రమాలూ చిత్రాల్లో ప్రతిబింబించాలి. నేడు గీయవలసిన చిత్రాలు రాజులు, రాణులు, వారి ఆభరణాలూ కాదు. సమాజంలో పతితలు, భ్రష్టులు, బాధాసర్ఫదష్టులు, దీనులు, హీనులు, కూడులేని గూడులేని పక్షులు, భిక్షులు, వారి జీవితాలను, మేడలమీద మేడలు, అంతస్థుల మీద అంతస్థులు కట్టేస్తూ విలాసాల్లో కులాసాల్లో కులుకుతున్న శ్రీమంతుల క్రీడలు, ఆగడాలు- తినడాని తిండిలేక మలమల మాడిపోతూ పుల్లిస్తరాకుల్లో ఎంగిలిమెతుకులకోసం కుక్కలతో సమానంగా పోరాడుతున్న మానవులు, కామంకైపులో కళ్ళుమూసుకుపోయి నడిరోడ్డుమీద