పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జానపదుల విజ్ఞాన దాయకమగు పెన్నిధి

ఈ పెన్నిధి అనేది వీరి జానపద వాజ్మయము, కళలు, క్రీడలు, వేడుకలలో ఉన్నది. మేధస్సంపన్నమైన నేర్పు, ప్రజ్ఞ, పుష్కలంగా కలిగి ప్రదర్శనీయమైనవి కళలు. వాసవానికి వాజ్మయము కూడ ఒక కళేగాని ఇది ప్రత్యేకించి రచనా సౌలభ్యం కూడా కలిగి యుండుట వల్లా, ఇతర కళలవలె ప్రదర్శనాత్మకము కాకుండుటవల్లా విడిగా చర్చించడం జరిగింది.

క్రీడలుకూడా కళలలోని భాగమే అయినా సూక్ష్మంగా పరిశీలిస్తే దీనిలో కళాస్పర్శ ఉన్నప్పటికీ బుద్దిగతంకన్నా అధిక శాతం భౌతిక శక్తికే ప్రాముఖ్యత యివ్వబడినందువల్ల క్రీడల్ని ప్రత్యేకంగా విడదీసి చెప్పడం జరిగింది. ఇక వేడుకలకు నేర్పుతో సంబంధంలేదు. కళాత్మకాలు కావచ్చుగాని వీనిలో కళకంటే కౌటుంబిక సామాజిక విషయాలు తాలూకు ముచ్చట్లు, మురిపాల పర్వమే హెచ్చుగాన వీనినిగూడా విడిగా పరామర్శించడం జరిగింది.

                        జానపద వాజ్మయము
  • "సాహిత్యము, సారస్వతము, వాజ్మయము అనుపదములు మూడును కొంచెము ఇంచుమించుగా సమానార్ధకములు గానే వాడబడుచున్నవి. కాని సూక్ష్మముగా పరిశీలించినచో వాని అర్ధ విస్తృతిలో కొంచ భేదము కన్పించును. ఈ మూడు పదములలో వాజ్మయము అనునది మిగిలిన వానికంటే కొంత విస్తృత తరమైనది వాగ్రూపమైన సర్వమును ఈ జాతికి చెందునని చెప్పవచ్చును. సారస్వతము అను పదమంత విశాలమైనది కాదు. లిఖితమైన లేక ముద్రితమైన గ్రంధజాలమంతయు ఈజాతికిచెందును. దీనిని బట్టి శాస్త్ర గ్రంధములను సైతము సారస్వతము ని పిలువవచ్చును. సాహిత్యమును పదము

  • ఆంధ్ర వాజ్మయ చరిత్ర (ప్రవేశకము) ఆచార్య దివాకర్ల వెంకటావధాని