పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైశాల్యమున పైరెండింటికంటెను సంకుచితమైనది. రస ప్రధానములును, ఆనందప్రదములునగు కావ్యములను మాత్రమే ఈ నామముతో పిలువవచ్చును".

జానపదులది అనునృతంగాను, అనుశ్రుతంగాను ఒకరినుండి ఒకరికి అందిన సంపద. గ్రంధములుగాని, లిఖితములుగాగాని ఇది లేదు. అంతా వాక్ మయమేగనుక దీనిని వాజ్మయమనవచ్చును. ఇందు ఆనంద రసదిద్ధులు కూడా కలవు గనుక దీనిని సాహిత్యమని కూడా పిలువదగును. ఇది పేరు ప్రతిష్ఠలు ఆశించని అజ్ఞాత కవుల సాహిత్యసంపద. ఇదే జానపద సాహిత్య విలక్షణత.

                  క ళ లు

ఇవి మానసిక ప్రజ్ఞకు సంబంధించినవి. ఇందులో కొన్ని వినోదాత్మకాలు, కొన్నివిజ్ఞా వినోదాత్మకాలు. గోదావరి జిల్లాలో జానపద కళాకారులు ఎందరో ఉన్నారు. వారు వారి ప్రదర్శనల ద్వారా నిత్యం జనాన్ని మెప్పిస్తూ ఉదర పోషణ జరుపుకుంటూ తమ కళలద్వారా ప్రజలకి విజ్ఞాన వినోదాల నందిస్తున్నారు. ఇతరప్రాంతాల జానపద కళాకారులు కూడా వచ్చి ఈ జిల్లాలలో నెలల తరబడి పర్యటించి తమ ప్రదర్శనలతో జానపదుల్నిమెప్పించి విజ్ఞాన సిరులందించి, సౌభాగ్యసిరులు స్వీకరించి వెళుతుంటారు.

ఈ కళాసంపద ఎన్నో రూపాలలో సాక్షాత్కరిస్తుంది. వీనిలో ముఖ్య్హంగా తోలుబొమ్మలాట, యక్షగానం, వీధి నాటకం, హరికధ, బుర్రకధ,జముకులకధ, తంబుర కధ, పంబకధ వంటివి ప్రజల మీద ప్రత్యక్ష ప్రభావం కలిగినటువంటివి. విద్యాగంధం పండితులకే పరిమితమైపోయిన రోజుల్లో జానపదులను విజ్ఞానవంతుల్ని చేసిన ప్రక్రియలు ఈ కళారూపాలే. ఇగి విజ్ఞానాన్ని విరజిమ్మడమే గాక ఆనందవీచికల విహరింపజేస్తూ ప్రజల్లో శౌర్యసాహసాల్ని నూరిపోస్తూ అవసరసందర్భాల్లో కార్యోన్ముఖుల్ని చేయగలిగిన అత్యంత శక్తివంతమైన సాధనాలు. అందుకే ఇప్పటికీ ఇవి చిరంజీవులుగా నిలుచున్నాయి. రొమ్మరాట, గంగిరెడ్లాట వంటివి వినోదాత్మకాలు. పురాణం విజ్ఞానాత్మక కళకు ఉదాహరణ.