పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోయి ఆ చెట్ల కల్లు తీసి త్రాగి, కొట్టుకు తెచ్చిన పిట్టమాంసం కాల్చుకు తిని ఆమత్తులో సాయత్రం వరకూ అక్కడే నిద్రపోతారు. సాయత్రం ఇళ్ళకు వస్తారు. ఇల్లు అనేది కఱ్ఱముక్కలతోను, ఆకులతోను వేసుకున్న అల్పమైన చిన్న గుడిశ. సాయంత్రం కాగానే చలి విపరీతం. 'లగిడి ' వేసుకుకొని దానిచుట్టూ పడుకుంటారు. 'లగిడి ' అంటే ఒక లావుపటి దుంగకు నిప్పు ముట్టించి అది కాలుతుంటేఆ మంటచుట్టూ పడుకుంటారు. వీళ్ళు ఆవులను, గుఱ్ఱాలను, మేకలను పెంచుతారు. వీరి ఆతిధ్యం మేకపాలు, కారుకోడి మాంసం, కారుకోళ్ళు, నెమళ్ళు ఆ ఇళ్ళచుట్టూ చెట్లమీద తిరుగుతునే ఉంటాయి. ఆశ్చర్యం! పులులు. సివంగులు వంటి క్రూరజంతువులు కూడా ఆ ప్రాంతాలలొ తిరుగుతూనే ఉంటాయి. కాని వారి ఇళ్ళలోకి రావు. దానికి వాళ్ళు ఏదో మంత్రం వేస్తారంటారు. వీరు దారాలమ్మ, పోలేరమ్మవంటి వనదేవతల జాతరులు దివిటీల వెలుగులో ఎంతో కోలాహలంగ్తా చేస్తారు. కౌజు, అడవిదున్నలవంటిపెద్ద జంతువులను బలీచ్చి తిని, తాగి వేడుక చేసుకుంటారు. వీళ్ళ మంత్రశక్తి అపూర్వం. ఎవరికైనా మండ్రగప్ప కుడితే వీరిలో మంత్రగాడు ఆ కుట్టిన ప్రదేశంలో నొక్కి మంత్రం చదువుతాడు. వెంటనే తగ్గిపోతుంది. ఆ మంత్రగాడు చేతిలో ఆకు;పసరు ఉంటుందని ఆ పసరువల్లే అది తగ్గుతుందని కొందరంటారు. పాము కరిచినా కూడా అలాగే తగ్గించుకుంటారు. అక్కడ వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు ఏవి? వారి రోగాలకు అక్కడి పసర్లతోనేవైద్యం చేసుకొని రోగ నిర్మూలన చెసుకుంటార్. ఈ వనరుల వైద్యం వీరిలోచాలామందికి తెలుసు.

వీరు చాలా అమాయకులు. అరసోలెడు ఉప్పుకోసం అరవైమైళ్ళ దూరం నడిచి వచ్చి (పుల్లగినుంచి మారేడుమిల్లిసంతకు) అడవిలో తాము సేకరించిన మడపాకులు, సీకాయ,కుంకుడులు, చీపుర్లు తెచ్చి ఇచ్చి ఉప్పు, పాతబట్టలు, కరకజ్జం, జీళ్ళు కొనుక్కుని తింటూపోతారు. వీరిది డబ్బులతో బేరం కాదు - వస్తు;వులతో బేరం(బార్టరు సిస్టం). ఇందులో పాపంవీర్ పూర్తిగా దోచుకోబడతారు.

వీరు వస్త్రధారణ నామమాత్రం. స్త్రీలు ఒకటిన్నర గుడ్డను మానం కాపాడుకోవడానికి మొలకు చుట్టుకొని, స్థనాలు కనబడకుండా మరోగుడ్డపీలిక పైటలాగ వేసుకుంటారు. ఆడ్డబాస ప్రతీ స్త్రీకి