పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరిజన జానపదులు

గిరిజన జానపదుల తీరుతెన్నులు వేరు. గోదావరిసీమ గిరిజనులలో వాల్మీకులు, కొండరెడ్లు. లంబాడీలు, కోయలు ఎక్కవ. వాల్మీకులు హరిజన కుటుంబాలవారు. ఈ అడవి పల్లెలకు 'ముఠాలని ' పేరు. ఈ ముఠాలకు అధిపతులను ముఠాదారులంటారు. వీటికి ముఠా గుమాస్తాలు కూడా ఉండేవారు. వీరు మన మునసబు కరణాలవంటివారు. ముఠాదారుని మాట ముఠావాసులకు సుగ్రీవాజ్ఞ. ఎవరైనా అధికారులు వెళితే ఆ ముఠాదారునే కలవాలి. అతనికి కావలసిన సదుపాయాలు చేసి, మరో ముఠాకి వెళ్ళవలసి ఉంటే భద్రత కోసం మనుషులను ఇచ్చి అవతలి ముఠాదారు దగ్గరకు పంపేవారు. అడవిలో కాలిదార్లు తప్పిస్తే బండిదారులు కూడా కనబడవు. దట్టమైన అడవి, భయంకర జంతువుల అరుపులు - వీనిమధ్య ఒంటరి ప్రయాణం - బితుకుబితుకు మంటుంటుంది. అందువల్ల ముఠారార్లు మనుషులను తోడిచ్చి పంపుతుండేవారు. ఈ మనుషులు మన సామానులు కూడా భుజాన వేసుకొని మోసుకు వస్తారు ఉచితంగానే. ఇక్కడ వారి నిజాయితీకి దేశం గర్వపడాలి. ఆ ఆడవి మధ్యలో నాలుగుతన్ని మనలను దోచుకుంటే అక్కడ దిక్కూ మొక్కూ ఉండదు. కాని వారికి ఆతలంపే ఉండదు. విల్లు, బాణాలు దరించి దారిలో ఏజంతువునించైనా ప్రమాదం కనిపిస్తే వాటిని చీల్చి చెండాడి మార్గం సుకరం చేస్తారు.

                       వాల్మీకులు  - కొండరెడ్లు

తూర్పుగోదావరిలో రంపచోడవరం దగ్గరనుండి కుట్రవాడ, సాములేరు వరకు ఆదిపత్యం (కొండరెడ్లు). సాములేరుఆవల చెట్లవాడ నుండి వాల్మీకుల ఆదిపత్యం. సాములేటికి ఈవల ముఠాదార్లు రెడ్లు. వాల్మీకులు నౌకర్లు. ఇక్కడ వాల్మీకులు రెడ్డిగారు, రెడ్డిగారు అని రెడ్లను కొలుస్తారు. సాములేరు ఆవల వాల్మీకులుది అగ్రకులం. ఇక్కడ వాల్మీకులు ముఠాదార్లు. రెడ్లు వారి నౌకర్లు. ఇక్కడ వాల్మీకులు 'ఒరే రెడ్డీ ' అని పిలుస్తారు. ఏటికి ఇవతల, అవతల ఫర్లాంగుదూరం తేడాలో ఈ భేదం బలే ఆశ్ఫర్యంగా ఉంటుంది. వీళ్ళ ఆహారం పిట్టమాంసం, జీలుగుకల్లు. పిల్లా, పాపలతో అందరూ ఉదయం జీలుఇగుచెట్ల దగ్గరకు