పుట:Garimellavyasalu019809mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాషాంతరీకరించినాను. ఆమూలమున కీ మూలమును, ఆవ్యఖ్యానమున కీ వ్యాఖ్యానమును భాషాంతరీకరణమలైనచో, అ మూల మెంత సరియైనదై యుండవలెనో పండితులు గ్రహించియుండకపోరు. ఇట్టి ప్రఖ్యాత కావ్యములను భాషాంతరీకరించునెడల మూలమునకు సరిగనుండుట మొదటి యావశ్యకతయు జాతీయతయు సౌందర్యమును చెడకుండుట రెండవ లక్షణముగ మాత్రమేయై యుండవలసయుననియు, పెక్కురి విశ్వాసమును నా విశ్వాసమునునై యుండుట చేత నట్లే యొనరించినాను. మూలము పెక్కుచొటుల క్రిష్టముగ నుండినను వ్యాఖ్యాతమును బట్టియే దానిని పూర్తిచేసుకొనవలెను. నిది తప్పని సరి. అఱవములోని వల్లువరువారి గ్రంధమునకుని నిట్లే - దీనికిని నిట్లే కాకమానదు.

ఒక్కొక్క కుఱళులోని బావమతి విస్తారమై, ఆ చిన్న చందస్సులో నిముడక యుడుమలు నడుచు పాఠకునికి ఊహ్యము మాత్రమేయగుచు సామాన్యులకు "ఇంకను విపులముచేసి చెప్పిన నెంతయో బాగుండును గదా!" యనిపించుచుండును. ద్రవిడదేశ గ్రంధముల్లో నిది ప్రప్రధానమైన దనియు ముందే చెప్పియుంటిమి. ధర్మజిజ్ఞాసకులెల్లరును ధర్మ భాగమును దినదినమును పారాయణము నొనర్చుచుందురు. రాజులెల్లరును నర్ధభాగమును చెప్పించుకొని దానిలో శిక్షితులగుదురు. మంత్రులు మొదలగు వారికదియే యాదర్శము. శృంగార రసాభిలాషులు కామభాగమును పఠించుచు మైమఱచిపోవుదురు ఈ కారణము చేత అనేక రాజులు తమకు తమకై ప్రత్యేకము ప్రత్యేకముగ నీ సూత్రములను పండిత కవీంద్రులచే విపులీకరము చేయిపించుకొని పఠించుకొని ఆనందించుచుండెడివారు. మన ఆంధ్ర దేశమున నవీన కవిత్వపు పోకడలలో మున్ముందు త్రోవలు తీసిన రాయప్రోలు సుబ్బారావుగరు దీనిని విని ఒక్కొక్క సూత్రమును ప్రత్యేకముగా పెద్ద పెద్ద ఉత్పలమాలలు మొదలగు పద్యములలోనికి విపులము చేసి వ్రాయవలసిన అవశ్యకతయున్నదని వక్కాణించి, గ్రంధ మచ్చుపడితమకు పంపించగానే తామట్లు విపులము చేసి వ్రాతుమని చెప్పియున్నారు. అఱభాషలో నట్లు చేసికొనినారు. ఈ గ్రంధమహత్వమును గుఱెరింగి తమ తమ భాషలోనికి తర్జుమా చేసుకొనిన ఆంగ్లెయులు, గ్రీకులు. లేటినులు, జర్మనులు

గరిమెళ్ళ వ్యాసాలు

37