పుట:Garimellavyasalu019809mbp.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇటాలియనులు మొదలగు పాశ్చాత్యజాతుల వారెల్లరును నట్లే పద్యములలోనికిని గద్యములలోనికిని విపులము చేసుకొనినారు. రాయప్రోలు సుబ్బారావుగారు తలచినట్లుచేసినచో, ఇది నిజముగా వ్యాఖ్యానము కాకుండానే చాలా పెద్ద గ్రంధమై, వ్యాక్యాన సహాయము లేకుండానే సుబోధకమగుచు నలరారకమానదు.

  ఒక్ విధముగా జూచినయెడల తమిళు తిరుక్కుతళుకంటె ఇది మ్న ఆంధ్రుల కెక్కువ ప్రయోజనకారియని చెప్పకతీరదు.  తమిళ తిరుక్కుఱళు పురాతన భాషారచితమై వ్యాఖ్యానము కూడ కఠినశబ్దజాలనముపేతమై పండితజనంబులకు మాత్రమే తప్ప సామాన్యులకు దుర్గ్రాహ్యమై యెప్పుచుండును. ఇది యన్నచో నట్లుగాక బహుజనములకు సుబోధకమగు సాయాన్య భాషలో రచించింపంబడినది. అట్లనుట వలన నిదికేవలం వ్యవహారిక భాషయని కాదు. ఈ గ్రంధమును గ్రహించుటకు విస్తారమగు పాండిత్యమేమియు నవసరము లేదు. సామాన్యముగా మన నవలలు నాటకములు చదువుకొను టకును పత్రికా పఠనమునకును నెంతజ్ఞాన మవసరమో యంతజ్ఞానము దీనిని గ్రహింఛుటకు గూడ జాలును. అంతకన్న గూడ పేలవము జేయుట నాకు సాధ్యమును గాదు ఏలపదములకంటెను నెక్కువ కాఠిన్యమిందులోలేదు. నేను మహాపండితుడను కాకుండుట సామాన్యజనుల కొక విధమగు నుపకారమే. ఇది చదువుకొనుతకు గూడ తగినంత భాషాజ్ఞాన మాంధ్రసామాన్య పాఠకునకు లేదన్నచో ఆంధ్ర జాతికే యది తీరని కళంకమనక తీరదు.
   కుఱళులలో మాత్ర మన్యయ కాఠిన్యమును సందుల కలయికలను అపరూప పదముల ప్రయోగములును లేవని నేను చెప్పను. కాని ద్రవిడ మూలమున కిది సరియైన తర్జుమాగా నుండి సాధ్యమైనంతవరకు ఆ వ్యాఖానమునకివి అతుకుకొని యుండవలెననిన నే నామాత్రము యిబ్బందులు పడక తీరదు. ఆంధ్రుల నామాత్రము కష్టపెట్టకతీరదు. వ్యాఖ్యాన మా కష్టముల ననెకములను పటాపంచలు చేస్ మనోహరముగ జేయక మానరు. గ్రంధము కష్టముగనున్నదని భావించువారు కూడ తమిళకుఱళు తమిళులకు కన్న ఆంధ్రకుఱళు ఆంధ్రులకు ఎక్కువ అందుబడిలో నున్నదని గ్రహించి