పుట:Garimellavyasalu019809mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడా తెలియుచున్నవి. దేశభాషలును, శాసనముల లిపులును, దేశ లక్షణములును స్వదేశీయుల మగుటచేత వారి కంటె మనకు మఱీబాగుగా తెలియ గలవు. వారి సిద్ధాంతములు సరిగా లేవనియు అవిప్రబలినచో మన నిజ లక్షణములు బయలు వడక లోకము మోసపోవుననియు భావించి పెక్కులు దేశీయులా రంగములోనికి దిగి క్రొత్త చరిత్రలు వ్రాయుచున్నారు. దేశచరిత్ర వ్రాయు నుద్దేశముతో గాక సాహిత్య చరిత్రము నెఱుగు నుద్దేశ్యముతో కొందరు వానినెల్ల తిరగవేసియున్నారు. కొమర్రాజు లక్ష్మమణరావు గారు, వీరేశలింగం పంతులుగారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, జయంతి రామయ్య పంతులుగారు మొదలైన వారెల్ల రెండవ తరగతి వారు వీరి పరిశ్రమల నాదారము చేసుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రమును విపులముగా వ్రాయవలసి యున్నది. ఆంధ్ర సాహిత్య చరిత్రమునకును ఆంధ్రచరిత్రమునకు అవినాభావసంబంధమున్నది. కనుక ఆ సందర్భములోనే ఆంధ్రసాహిత్య చరిత్ర కవుల చరిత్రలు కూడ దొరకును.

వార్తాపత్రికలు

   వార్తాపత్రికల వైపున కొకసారి చూడనిదే గద్య కావ్య ప్రశంసను మనము విడచి పేట్టజాలము.  వార్తాపత్రికలు కేవలమును వార్తావాహకములు మాత్రమే కావు. యుక్తాయుక్త విచక్షణము, సమహిత శీలము, దేశాభిమానము, స్వాతంత్ర్యకాంక్ష నిర్భీరుత్వము, మొదలగు గుణములు గల సంపాదకులచే నడుపబడుచుండు పత్రిక అనతి కాలములో దేశములో ఆచార్యపీఠము వహించి, ప్రజలకు విధినిషిద్దములను చూపుచు క్లిష్ట సమయముల యందు అనుసరణీయమైన సలహాల నీయగల హక్కును సంపాదించుకొనుచున్నది. దేశములో వివిధ రాజకిఈయాభిప్రాయము భేదములు సాంఘిక విదానములు, విశిష్టమతములు నుండి యొకరి సలహా యొకరికి వచ్చును గాక. మానుము గాక, వ్యాసముల యందలి, అందును ముఖ్యముగ సంపాదకీయములందలి శైలి, వారము వారమునో దినదినమునో వీనులపై డప్పుల శబ్దము వలె పడుచుండుట చేత ఇది రహస్యముగా పాఠకుల భావనలోనికి వచోవిధానములోనికిని దూరి, దేశీయ సాహిత్యమునకే యొక క్రొత్త ధోరణి