పుట:Garimellavyasalu019809mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్పించక మానరు. ఈ విషయములో దేశమాత చేసిన సేవయు కృష్ణాపత్రిక యొనరించుచున్నదియు మిగుల ప్రశంసింపదగినవి. ఇప్పుడు చేతిలో నైదువందలు గల గల లాడుచున్న వారందరును ఒక పక్షమునో, ఒకవ్యక్తినో, ఒక జాతినో దూషించుటకై యేక పత్రికను పెట్టుకొని కొన్ని నాళ్ళు గల గల లాడించి చిత్త జల్లుల వలె వెలసిపొవుచున్నారు. కొన్నిపత్రికలలో పత్రికలు సాగుటకు గల మదుపు, పేజీలు నిందుటకు గల మాటలు, ప్రకటనదారుల (Advertisers) నమూనా సొమ్ములను తప్ప ఒక శైలి గాని సాహిత్యచాతురిగాని కానరాకున్నవి. ఆంధ్రపత్రిక సంపాదకీయముల కొంచెము పొట్టితివైతే బాగుంటుంది. బ్రాహ్మణులు దానవులు కారని తలుస్తే సమదర్శిని మంచి ఆదరణ పాత్రమౌతుంది. బ్రాహ్మణేతరొద్యమముతో ఢీకొనుటయే తన అవతారము యొక్క ఆదేశమనుకోకుంటే తెలుగు గీతము నొక్క ప్రతి తగ్గించి పాపము సుబ్బమ్మగారి వంటి బాల వితంతువుల మీద మంచి తన ఆయుధపు గుఱిని తప్పించినచో తెలగపత్రిక యెక్కువ శౌర్యవంతమౌతుంది. దానిశైలియు సాహిత్య చాతుర్యమును నీచపు హెళనల నుండి విరమించవలెను. దురుసు తనమును బాల్య చాపల్యమును విసర్జించినచో కాంగ్రెసు పత్రిక యెక్కువ మన్నన పాత్రమౌతుంది. అయితే యెన్నికలు దాటే వరకు మాసలహా యెవరికి గాని నచ్చునని తొచదు. ఆ తరువాత మిగిలినవి యెక్కువ స్తుతి పాత్రము లౌతాయని నమ్మవచ్చును.

గ్రంధ విమర్శకుడు

    పిమ్మట నాంధ్రగ్రంధములు విమర్శనము చేయవలెను. మొన్న మొన్నటి వరకును గ్రంధ విమర్శన మనిన ఒప్పులు మానివేసి తప్పులు చూపించుట యనియే అర్ధము. అవియును వ్యాకరణము తప్పులు, గురుజాడ శ్రీరామమూర్తి గారు, వీరేశలింగం పంతులుగారు మొదలైనవారు అంతకన్న ఒక మెట్టు ముందుకు వచ్చి కవి జీవించిన కాలనిర్ణయము, అతని వంశావళి, అతని మతము, అతని పద్యముల నుండి రసగ్రఃహణార్ధము కొన్ని పద్యములనెత్తి వ్రాయుట యీ మొదలగు పనులు చేసినారు విమర్శనమనిన నింతకన్నను ముఖ్యమైనపని యున్నది. ఆ గ్రంధములలోని రసమును గ్రహించుట.