పుట:Garimellavyasalu019809mbp.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముంచేయ గలరని భోరుగారు హెచ్చరిక చెప్పేరు మారకపు రేటు మార్చి నాణెములు హెచ్చించమంటే సాధ్యము కాదని తోసేశారు. క్రొత్త పంటలను గూర్చి ఆలోచించుటకు జనపనార, పత్తి, చెఱకు, కమిటీలు పరిశోధనపని చేస్తున్నాయి. మొత్తము పయిన ఈ సభసమావేశమున కయిన ఖర్చులు దండుగైతే అయినవి కాని ఇందులో నష్టకరమైన తీర్మానములు ప్యాసుకాలేదు. వరిపంట ఇంకా హెచ్చించే ప్రయత్నాలు చేయరేఅదనుకున్నారు. అట్టి ఆలోచన మనకసలే లేదు. గోధుమ పంట తగ్గించాలన్న తీర్మానం కూడ నెగ్గలేదు. సభాఫలితములిప్పటి కేమి లేకపోయినా, వీరి కమిటీలు చేసే విచారణ ఫలితంగా ముందు ముందు మంచి ఫలితములు కలుగవచ్చునని సంతోషిస్తూ పత్రికా రత్నములు అభిప్రాయములు వ్రాస్తున్నవి. ఇదీ మన ఇండియా ప్లానింగు.

-భారతి, జూలై, 1934