పుట:Garimellavyasalu019809mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ సంస్కరమునకు ముందు నగర సంస్కారమే ప్రారంభము కావలెను.

గ్రామ పునర్నిర్మాణమునకు ఒకే ఒక మార్గము

  భారతదేశం గ్రామాలయం నూటికి తొంబైమంది గ్రామాలలో నివసించేవారే పట్టణయంత్ర కార్మికుల సంఖ్య కొంచెము లక్షలకు మించి యుండరు. కనుక ఇక్కడ యే సంస్కారం ప్రారంభింతామన్నను గ్రామముఖతా ప్రారంభమైతేనే అది నిజముగా ప్రజాహితొద్యమ మనిపించుకుంటుంది. కాని, నగరముఖతా వచ్చే సంస్కరణలన్నీ యే కొంచెము తరగతులకు చెందినవో అనిపించుకొనును గాని భారతప్రజాబాహుళ్య సంస్కరణము అనిపించుకొనవు. అందుకనే గాంధీ మహత్ముని అసయాయోద్యమము మొదలుకొని కోఆపరేటర్ల సహకారోద్యమము వరకు వస్తున్న ప్ర్రజాహిత ఉద్యమములు గ్రామములలో తిష్ఠవేసుకొనుటకే తంతాలు పడుతున్నది. కాని నగర సంస్కరణముతో తృప్తిపొందలేదు ఆఖరుకు మన ప్రస్తుత విసురాయి లిల్లితుగో ప్రయత్నములు కూడ వ్యవసాయపరిశోధన, పంటల వర్తకమునకు సలహా, ఆంబోతుల సరఫరా మొదలైన గ్రామీణ సమస్యలకే యెక్కువగా సంబందించుచున్నవి. కాని పట్టణముల  మీద మితీమించిన దృష్టిని పెట్టుకోలేదు.
  భారతదేశములు నెదు శిధిలములై సంస్కరణమునకు సద్యములా అన్న అనుమానమును గూడ మంకు కొలువుతున్న వనుటకు సందేహం లేదు. నాటి ప్రాచీన వాసనలా వదలిపోయినవి, క్రొత్త సంస్కరణములా పూర్తిగ అంటకుండా ఉన్నవి. ప్రాత సంపదలు సంతృప్తి చెరిపివేయబడినవి. క్రొత్త సౌభాగ్యము దర్జా అంటలెదు. ప్రాత ఆచారములు పాడుబడినవి. క్రొత్త సౌభాగ్యం దర్జా అంటలేదు, ప్రాత ఆచారములు పాడుపడినవి. క్రొత్త అభ్యాసములు మనస్కరించకుండా ఉన్నవి. ఇట్లు అవి రెండింటికి చెడ్డ రేవడులలాగ నున్నవి.
    వీటన్నింటికి సాయం కులకక్ష లొకవైపున, తరగతి యుద్దభావము లొకప్రక్కన వానిని పీడించుచున్నవి. అన్నిటికీ మూలకారణం దారిద్ర్యం కక్షలు పోయి పరస్పర సహకారం వర్దిల్లితే కాని సంపదలు సౌభాగ్యం రావు. సౌభాగ్యం వచ్చే ఆశలు లేకుంటే పరస్పర సహకారం వర్ధిల్లదు. నీతి కుదిరితే కాని భుక్తి కుదరదు. భుక్తి కుదిరితేనె కాని నీతి వైపు ఆలోచనే వెళ్ళదు.
గరిమెళ్ళ వ్యాసాలు