పుట:Garimellavyasalu019809mbp.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రోవ ఏర్పరచి ఒక ప్రక్కన తమ తలుపులు బాహాటముగా తెరచుకొన్నారు. ఇట్టి సహాయములో మన మిల్లులు కోలుకొవడం ఎట్లా? దీనికి సాయము సమ్మెలు, వానిని ముగించే ప్రయత్నముల నుండి పరాన్ముఖత్వము మిల్లుపరిశ్రమలను గురించి అటావా ఒడంబడిక వుండనే వుంది. కనుక వేఱే ప్లానింగు చేయుటకు వీలే లేదు.

   ఇక గృహపరిశ్రమల నుద్దరించడానికి ప్లానింగు, గృహపరిశ్రమలు సధారణముగా మిల్లు పరిశ్రమలలో పోటీ కాగలేవు. మిల్లు పరిశ్రమలు హెచ్చితే గృహ పరిశ్రమలు మూలపడతాయని గత రెండువందల సంవత్సరముల నుంది జరుగుతున్న పారిశ్రామిక విప్లవమె తెలియపరచుచున్నది.
 మనదేశములో ఒక ప్రక్కన గాంధీ గారి ఖద్దరు తత్త్వము వలన  ఇంకొక ప్రక్కన విదేశీ మిల్లుల వస్తువుల దిగుమతి ఒడంబడిక వలనా స్వదేశీ మిల్లులు క్షీణముఖము పడుతున్నవి గనుక, యీగృహపరిశ్రమల వస్తువులైనా యిక్కడ వ్యాపింపజేసి వ్యవసాయకుల కుపవృత్తి గలిగించితే అంటే అదీ మంచి ఆలోచనే! హింద్సూ దేశమింకా పూర్తిగా మిల్లుతత్వములో పడలెదు గనుక, హిందూదేశస్థులకు ఇంకా గృహపరిశ్రమలవలన తయారయే వస్తువులను కొనుక్కొనుట యందభిలాష వుంది కనుక అట్టి పదార్ధము లిక్కడ చెల్లించే యేర్పాటు చేయడం, రెయినే రేటులు తగ్గించడం మంచి యెత్తే కాని ప్రభుత్వము వారు తలపెట్టినదిది కాదు. గృహపరిశ్రమల అభివృద్ధికి సంవత్సరమున కెంతో కొంత స్వల్ప మొత్తమును శాంక్షను చేస్తూ వుండడము. ఈ వస్తువులే కొనుక్కోమని పాశ్చాత్యులను బ్రతిమాలుకొని వారికి వీటి యందభిరుచి పుట్టించుటకు ప్రయత్నించడము. ఈ రెండవది యెప్పటికైనా సాగుతుందని ఏ జ్యోతిష్కుడైనా పాశ్చాత్యదేశాల జాతకములు చూసి చెప్పగలడా? అయితే ఇందుకొరకు వాణిజ్యానుభవముగల పాశ్చాత్య ధీమంతులను పెద్ద జీతముల మీద యేర్పాటు చేయడము వారి క్రింద్ రాష్ట్రీయోద్యోగస్థులు, వారికి సెక్రటరీలు, అనుచరులు మొదలగు వారితో ఒక చిన్న డిపార్టుమెంటు మనకు తప్పదు.
  ఇంకో చిత్రమైన ప్లానింగు ఇది మన హిందూ దేశమున కహార భూతములైన వడ్లు, గోధుమలు, చెఱకు మొదలగు వానిని గుఱించిన 
గరిమెళ్ళ వ్యాసాలు