పుట:Garimellavyasalu019809mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతన సాహిత్య విజృంభణము

   ఆంగ్లేయ నాగరికత, ఆంగ్ల సాహిత్యము తోడి పరిచయము, ఆంగ్ల పాఠశాలలలో ప్రవేశము మొదలైనవి యేర్పాటు కాబడినప్పటి నుండి తెలుగు సాహిత్యములో కొన్ని మార్పులుదయములైనవి.  ఈ మార్పుల యొక్క సూచనలంతకు ముందరి కాలములో కూడా నుండవచ్చును. వీటిలో నా కాలము యొక్క లక్షణము అలరారుచుండ వచ్చును. ఇవియును కావలసినంత పెద్దమార్పు లింకనూ కాకపొవచ్చును అయినను దీని నొక ప్రత్యేక యుగమని నిర్ణయించ వలసినత బేదమున్నది కనుఇఅ దీనిని "నూతనయుగ"మని బావించుట కాటంకము లెదు.  ఈ యుగమేట్లు ప్రారంభించుచున్నదియు, ఎన్నెన్ని రూపములు దల్చినదియు, ఎట్లెట్లు పరిణామము నొందవలసినదియు మనము చూడవలసియున్నది.
     ఇంతకౌ ముందర కాలమును కాదని యీ యుగము యొక్క ప్రత్య్హేక విజృంభనములు గద్య రచనమును, ఖండకావ్యములును, నాటకమ్లును అచ్చు ఆఫీసులు యెక్కువయై, సంస్కార ప్రచారముల కవసరము పుట్టి, అక్షరజ్ఞానమును పఠనాసక్తియు ప్రజాసామాన్యములో మునుపటి కన్న విరివి యైన యీ కాలమ్లో నవి మూడును విజృంభింప దొరకొనుత సహజము. అట్లని పూర్వపు ప్రబంధములిప్పుడు వ్రాయబడకుండక పోలేదు.  పూర్వము గద్యకావ్యములు కాని ఖంద కావ్యములు కాని లేవని కాదు. ఈ యుగములో ప్రబంధ సృష్టి తగ్గినదినియు, ఖండకావ్యం లెక్కువయైనవనియు, గద్యముయొక్క ఉపయోగములు హెచ్చినవనియు మాత్రమే దీని యభిప్రాయము. ఇప్పుడు వ్రాయబడిన కొలది ప్రబంధములకును అంతకు ముందరి పబంధములకును చాలా భేదము కూడ నున్నది.
     ఈ యుగము తిరుపతి వేంకట కవీశ్వరుల కైత్వములతోను, వీరేశలింగం పంతులు గారి వచనములతోను ధర్మవరం కృష్ణమాచార్యులు గారి నాటకముల తోను ప్రారభించుచున్నదని చెప్పవచ్చును.  వీరి యుద్యమముల కంతకు ముందు ప్రారంభములు లేవని యర్ధము కాదు.  కాని యిట్ట్ యుద్యమములలో కీర్తి ప్రారంభకులకు కాక, ఆ రంగముల గరిమెళ్ళ వ్యాసాలు