పుట:Garimellavyasalu019809mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావలసిన వస్తువుల నీదేశములో పండింఛి తయారు చేయించి పరదేశములకు అమ్మి లాబములు చేసుకోవడం, ఈ దేశమునకు కావలసిన వస్తువు లిక్కడ పండకుండా తయారుకాకుండా చూస్తూ పైదేశముల నుంచి తెప్పించి అమ్మి లాభములు చేసుకొవడం వారి ఏకైక లక్ష్యము. ఆంగ్లో అమెరికను ధనాడ్యులు కొరేది కూడా అదే. కనుక వారికి వారికీ వియ్యము. ఇంక ఈ వర్గములో జాతీయత యెట్లు వర్ధిల్లగలదు. ఆమిల్లు యజమానులు, వర్తకులు తమ లాభాల మీద చెల్లించే పన్నులు సుంకములే ఈ దేశ ప్రభుత్వములకు భృతి, కనుక మన కేంద్రప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వమును వారి చెపు చేతలలో మెలగుచున్నవి.

  యెక్కడ చూచినా, చిత్తు కాగిరాలకంటే అధికంగా వందరూపాయల నోటులే. వస్తువుల ధరలు మిన్నంటినవి. కర్షక కార్మికాది వినియొజనులకు యెంత పెద్ద జీతాలు ఇచ్చినా వారికి చాలకున్నవి. వారు సమ్మలకు దిగుచున్నారు. కమ్యూనిష్టులు వాటిని రేపుచున్నారు. ఉత్పత్తి నిలచి పోవుచున్నది. రేపేమి అవుతుందో యెవరికి తెలియదు. ఇదంతా ఇప్పట్లో తెమలే సంగతి కాదన్న విశ్వాసం మంత్రులకు శాసన సభ్యులకు ఉద్యోగులకు విశదమైనది. పదవులలోకి వచ్చిన వారందరూ యేవేవో పైపై లెక్చర్లిచ్చుచు దీపము ఉండగానే యిల్లు చక్కపెట్టుకుందామనే తత్వంలోకి పడ్డారు.
  ఈ ధనాశాతత్వంలో దేశమంతాపడి ఒకరితో ఒకరు పోటీ చేసుకుంటూ, ఒకరి డొక్కమీద ఒకరు తన్నుకుంటూ, అనాదలందరూ అణగి, గడుసువాళ్లంత గర్విష్టులగుచున్నారు. ఇదే నేటి బ్రాహ్మణా బ్రాహ్మణ, నియోగివైదెకి, రెడ్డి, కమ్మ, కాపు, మాలమాదిగాది కులతత్వ ద్వేషములకు మూలకారణమై యున్నది. ఈ కులతత్వవాదులె నేడు ప్రభుత్వ పదవులలో విరాజిల్లుచున్నారు. అందువల్లనే వారు పదవులలోకి రాగలుగుచున్నారు. సంపూర్ణ జాతీయవాదులు పదవులనుంచి బహిష్కృతులైనారు. వారి బోధలు ప్రభువులకు గని ప్రజలకుగాని చెవుల కెక్కవు. పైగావారికే కులతత్వ వాదులని మచ్చ తగిలించారు.
   మనదేశములో నేదు డెమాక్రసీ ఇట్టి అధోగతినున్నది. ప్రతీవ్యక్తియు రస పిపాసను విసర్జిస్తేనే కాని జాతీయత యేర్పడదు జాతీయత యేర్పడితేకాని ఐకమత్యమే సిద్ధించదు. ఐకమత్యత సిద్దిస్తేనే కాని వస్తూత్పత్తి హెచ్చడం, ధరలు తగ్గడం, కడుపు నిండడం, బలం పెరగడం, శత్రువులను జయించడం మొదలైనవి
  గరిమెళ్ళ వ్యాసాలు