పుట:Garimellavyasalu019809mbp.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదారములనుకొనే ఫర్మానాలు మొదలైన కపట నాటకాలు, లొలొన ఆయుధ సేకరనలు, సైనిక కవాతులు, దోపిడీలు, హత్యలు, శిక్షలు మొదలైన చర్యలు.

భారత యూనియన్ ప్రబుత్వమునకు ఓరిమి పట్ట గల దినములు గతించినవి. నైజాము చిత్తవృత్తి మారి, బాధ్యతను గుర్తించి నామమాత్ర పాలకుడైతే సరే లెకుంటే చర్యతీసుకోక తప్పదు. ఈ అంశమీనాటికీ సుస్పష్టమైనట్లు కనిపించుచున్నది.

  అసలు రహస్య మొకటి చూచుకొనవలసియున్నది. పాకిస్థాను గాని నైజామునుగాని ఉభయులను గాని ఓడించడం భారత యూనియను కొక కష్టముకాదు. అయితే ఆ ఉభయులకు మన బ్రిటిషు జాతి వారు, ఐక్యరజ్యసమితివారు ఎట్టిసహాయము చేయుచున్నారో మన మెరుగుదుము. ఇంకా చేయగలరో మన మూహించుకోవచ్చును. మనము వీరి తిరుగుబాటుతొ పాటు రహస్యముగాను బహిరంగముగాను వారికి అండగావుంటున్న ఆంగ్లో - అమెరికను విమాన దాడులను ఫిరంగి గుండ్లను ఎదుర్కొనవలసి వచ్చునెమో!
 అట్టి దొసగు రాకుండుటకే భారత యూనియన్ ఎంతో ఓర్పు వహించుచున్నది. కాని మనమెంత ఓర్చినా సరే, కాశ్మీరంలో వలె హైదరాబాదు విషయంలో కూడా వారు జొక్యం కలిపించుకొని మనను నేరస్థులుగా చేసి హైదరాబాదుకు దన్నగుటకు సిద్ధమవు తారు. హిందువులంటే ఈ దేశములోని యీ ముస్లిము వర్గములు మొదలు పశ్చిమదేశములలోని అధ్రనాధ్రవ్యర్గములవరకు అంతపగగా ఉన్నది. దానికి కారణము వారి వినిర్మల జాతీయతత్వమును, ధర్మదీక్షయే. భారత యూనియనే బలిష్టముగా ఉంటే, ప్రపంచంలో అరనిమిషములో ధర్మరాజ్య మును స్థాపింపవచ్చును., ధర్మరాజ్యములొ తమ దురాశత్వపు పప్పు ఉడకదు. కనుక దానిని మొగ్గలోనే త్రుంచి వేతామని వారు సకల్పించుకొన్నారు.
  అయితే నేడు భారతయూనియనుకు ఈ బహిశ్శత్రువు లేనా లేక అంత:శత్రువులు కూడా ఉన్నారా అన్న విషయము ఆలోచింప తగ్గది. బ్రిటిషు వారి ధర్మమంటూ నేడు హిందూ సంఘంలో స్వార్ధత్వము పూర్తిగా పాదుకొని పోయింది. మిల్లు యజమానులకు జాతీయతత్వము పూజ్యము. తమకు 
గరిమెళ్ళ వ్యాసాలు