పుట:Garimellavyasalu019809mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేరమంటున్నా వినక తన పారమౌంటసిని నిలిబెట్టుకొని స్వతంత్రంగా నిలచి భారతదేశముపై కుట్రలు పన్నుచున్నాడు. ఇందులో అతనికి త్న పక్షీయులగు రజాకార్లు అంగరక్షకులు ఆ రాజ్యములో వారడినది ఆట, పాడినది పాట. ప్రజానీకపు ధనప్రాణమానములు గడ్దిపోచలలాగ యెగిరిపోవుచున్నవి.

  నేడు జిన్నా కాశ్మీరు పైకి పఠానులను దండయాత్ర పంపి కావలసిన సహాయాల నన్నింటినీ అర్పిస్తున్నాడు. ఇద్ అంతర్జాతీయ సమితి సూత్రానికి వురుద్ధ చర్య అందులో ఇండియా పాకిస్థానులు రెండూ సభ్యదేశములు. ఈ నెరమునకు గాను ఇండియా పాకిస్థాన్ పై ఫిర్యాదు చేస్తే భద్రతా మండలి ఆ విషయమును అసలే చెవి పెట్టక, భారతదేశముమ్ను కూడా ఒక నేరస్థునిగానే భావించి తన తీర్పును దేనినో ఈ దేశముపై రుద్దచూ చుచున్నది ఇట్టిపక్షపాత చర్య అట్టి అంతస్థు గల సంస్ధకు సిగ్గుఛేటని కూడా అది భావించలేదు. సిగ్గులేని వానితో యేధర్మమున కాశ్మీరు ప్రధాని చూపుచున్న ధీరత్వమెంతయు అభినందనీయమై యున్నది. భద్రతా మండలిపప్పునక్కడ ఉడకనీయనని అతను కంకణము కట్టుకున్నాడు.
    ఇంక మిగిలినది హైదరాబాదు. అది తప్ప తక్కిన సంస్థానములన్నీ భారతయూనియనులో చేరి బాధ్యతాయుతములను నెలకొల్పుకొన్నవి. కాని నైజాముకు అట్టి చర్య అవమానకరముగా కనిపించుచున్నది. ఆ సంస్థాన ప్రజలలో నూటికి 80 వంతులైన హిందువులకు అటు చేరకపోవడం అవమానకరముగా నున్నది. సంస్థానకాంగ్రెస్సుకును అతనికిన్ ఇప్పుడు లడాయిగా నున్నది. ప్రస్తుతం మట్టుకు సైన్యాలు, ఉద్యోగస్థులు తన ప్రభుత్వాధీనములో నున్నవి కనుక ప్రజలనతను చావచంపి చెవులు మూయగలుగు చున్నాడు. లక్షలకొలది జనులు భారతయూనియను రాష్ట్రాలలోకి రక్షణ కొరకు పరుగిడుచున్నారు. సరిహద్దులలో ఉభయ బలాలకు పొరాటములు జరుగుచున్నది. ఏ సమయముననైన ఇదే యుద్ధముగా పరిణమించవచ్చును.
  భారత యూనియను గర్భములో హైదరాబాదప్పుడు రాచకురుపుగా పరిణమించి పై పైని యధాతధపు ఒడంబడికలు, రాయబారములు,
గరిమెళ్ళ వ్యాసాలు