పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

అయిదవ అధ్యాయము


రెండుకళలుగా: విభజించి యుద్ధములు చేయుచుండిరి. ఈ స్థితిని కని పెట్టి 1413 సంవత్సరమున ఆంగ్లేయ రాజగు అయి దవ 'హెన్ రీ పరాసు దేశము పై దండెత్తెను. 1415 వ సంవత్స గమున ఎజినోకోర్టువద్ద జరిగిన గొప్ప యుద్ధములో ఆంగ్లేయు పరాసు సేనలు పూర్తిగ నోడించబడెను. ఫ్రాన్సులోని అంతర్యుద్ధ మెక్కు,వయ్యెను. ఒక కక్షి దారగు బర్గండీ ప్రభువు ఆం గేయ రాజుతో చేరెను. ఆంగ్లేయ రాజుపని , మంచిద య్యెను. 1418 వ సంవత్సరమున ఆంగ్లేయరాజు నా ర్మండీ రాష్ట్రమును జయించెను. పరాసు రాజపక్షము వారు చేయునది లేక ఆంగ్లేయ రాజగు హెన్రీతో సంధి చేసికొనిరి. హేన్రీ పరాసురాజు యొక్క కూతురిని వివాహమాడునట్లును, రాజు యొక్క జీవితకాలములో పరాసు దేశము నాయన పేరును పాలించునట్లును 1420 సంవత్సరమున సంధి చేసికొనిరి. మరుసటి సంవత్సరము 'హెన్రీ పారిసు పట్టణమున ప్రవేశించెను. కాని 1422 సంవత్సరమ. న హెన్రీ చనిపోయెను. ఆ సంవత్సరమే పరాసు దేశపు పిచ్చి రాజుకూడ మరణించెను. ఆయన కుమారు డగు ఏడవచార్లెసు పరాసు దేశమునకు రాజయ్యేను.

ఆర్లియన్సు
ముట్టడి,

ఇంగ్లీషు వారితో యుద్ధము జరుగుచునేయుండెసు. ఇంగ్లీషువా రేజయముల నొందుచుండిరి. పరాసు దేశములో ఉత్తర

భాగము నంతను ఆక్రమించు కొనిరి. 1428 సం

వత్సరమున ఆంగ్లేయ సేనలును, బర్గండి ప్రభుసేన లును కలిసి పరాసుదేశము లోని దక్షిణ భాగమునకు ముఖ్య మయిన దగు ఆర్డియన్సు పట్టణమును ముట్టడించిరి. ఈ పట్టణము