పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
52

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

శత్రువుల చేతిలో పడిపోవుటకు సిద్ధమగుచుండెను. ఇది పడినచో పరాసురాజు పరాసుదేశమును విడిచి పారిపోవలసినదే.

3

జోన్ ఆఫ్ ఆర్కు

ఇట్టిస్థితిలో విదేశీయులగు ఆంగ్లేయులనుండియు, 'దేశ ద్రోహులగు బర్గండీయులనుండియు పరాసు దేశమును రక్షిం చుటకు ఒక యువతి బయలు దేరెను. ఈమె పేరు జోన్ ఆఫ్ ఆర్కు. ఆమె డెమ్రీ అను గ్రామములోని యొక - వ్యవసాయకునికూతురు. ఆమె కప్పు టికి పందొమ్మిది సంవత్సరముల వయస్సు. మిగుల సాధువు.. పవిత్ర హృదయురాలు. గొప్పభక్తురాలు. విదేశీయులు తన దేశీయులను గావించుచున్న హత్యలకథలను వినుచుండుట వలన ఆమెకు హృదయ వేదన కలిగెను. తన దేశపు రాజగు పదవచార్లెసు యొక్క దీనస్థితిని వినిన కొలదియు ఆమె వేదన హెచ్చెను. ఎల్లపుడును దేవాలయములోను, అడవులలోను, తోటలలోను నొంటరిగా ఆమె తన దేశవిముక్తి కొరకుసు, తన రాజునకు జయము కలుగవలెననియు ప్రార్థించు చుండెను. క్రైస్తవమహాత్ములు ధర్మయుద్ధములో పరాసు సేనలకు జయముకలుగ జేయక పోరను ఆశ ఆమె మనసులో నుండెను. 'పగలును రాత్రియు ఆమె కదియే పరితాపము. ఆమెహృదయము దేశాభిమానము తోడను, హింసింప బడుచున్న వారియందు కరుణారసముతోడను నిండియుండెను. ఒక్కరోజొక మధ్యాహ్న మొక దివ్య స్వరూప మామెకు గన బడి "జోన్! బయలు దేరుము. పరాసు దేశపు రాజును రక్షింపు ము. ఆయన రాజ్యము నాయన కిమ్మ. " అని చెప్పినట్లు విన