పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
50

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

వరాసురాజు “జాన్ " చనిపోయినందున ఆయన కుమా మడగు అయిదవ చార్లెసు రాజ్యమునకు వచ్చెను. తిరిగి యుద్ధ మును ప్రారంభించెను. 1372 సంవత్సరమున లా రొషీలు వద్ద నింగ్లీషు నౌకలను పరాసునౌకాదళ మోడించెను. 1377 సంవత్స రమున ఇంగ్లాండులో మూడవ ఎడ్వర్డు రాజు చనిపోయెను. అప్పటికి ఫాస్సులో కెలే మొదలగు కొన్ని పట్టణములు తప్ప మిగిలిన ఆంగ్లేయ రాజునకుఁడిన రాజ్యమంతయు పరాసురాజు తిరిగి స్వాధీన పఱచుకొనెను. యుద్ధమువలన పరాసు దేశము నకు మితి లేని నష్టముగలిగెను. యుద్ధకాలమున ఆంగ్లేయ 'సేసలు పరాసు ప్రజలను దోచుకొని, ఇండ్లు తగుల పెట్టి, దేశ మును నాశనము చేయుచుండెను. పరాసు రాజులు, ప్రభువుల సైన్యములు చాలక జీలిము లిచ్చి సైనిక దళముల నేర్పరచు కొనిరి. యుద్ధము లేనపు డీ సైనికులు దేశములో దోపిళ్ళు, హత్యలు జరుపుచుండిరి.

ఫ్రాన్సులో
అంతర్యుద్ధము.

అయిదవ చార్లెసు చనిపోవుసరికి ఆయన కుమారుడగు ఆరవచార్లెసురు పదునొకొండు సంవత్సరముల వయసుండెను. ఎటులనో రాజునకు యుక్తవయస్సు వచ్చువరకును పాలనముజరిగెను. యుక్తవయస్సు రాగ నే రాజుకు పిచ్చి యెత్తెను. ఆయన పేరట పరాసు దేశము నెవరు పాలించ వలెనసు విషయమున రాజబంధువులగు పరాసు ప్రభువుల మధ్య కలత లేర్పడెను. బర్గండీ ప్రభువు తాను పాలించప లెననియు, ఆర్మగునాకు ప్రభువు తాను పొలించవ లెననియు తగవులు పడి వారు కొందరిని, వీరు కొందరినీ చేర్చుకొని దేశమును