పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

49

కాలము యుద్ధము జరిగెను. పరాసురాజగు నాలుగవ ఫిలిప్పు యొక్క ముగ్గురు కొమాళ్ళును నిస్సంతతిగా చనిపోయిరి. 'ఇంగ్లాండు దేశవు రాజగు మూడప ఎడ్వర్డు నాలుగవ ఫిలిప్పు రాజు యొక్క కూతురి కుమారుడు గావున ఫొస్సు రాజ్యము తనకు రావలె ననెను. ఫ్రాన్సు దేశపు రాజుల ఆచారప్రకారము స్త్రీలగుండ స్థిరాస్తి సంక్రమణ లేదని చెప్పి నాలుగవ ఫిలిప్పు యొక్క తమ్మునికుమారుడగు ఆరవ ఫిలిప్పు ఫ్రాన్సు సింహాసనము నధిష్టించెను. ఇంగ్లాండు రాజగు ఎడ్వర్డు ఫ్రాన్సుపై దండెత్తెను. విదేశీయుడగు ఇంగ్లాండు రాజును తమపై పాలనము చేయకుండ చేయవలెనని ఫ్రెంచివారి యుద్దేశ్యము. ప్రథమమున కొంతకాల మింగ్లీషువారికి జయములు కలిగెను. 1346 సంవత్సరమున కెస్పీవద్ద జరిగిన గొప్ప యుద్ధములో ఇంగ్లీషువారు సంపూర్ణముగ జయమొందిరి. "కేలేయను రేవు 'పట్టణము ఇంగ్లీషువారికి స్వాధీనమయ్యేను. ఇంగ్లాండులో ఘోర మగు ప్లేగు వ్యాపించినందున కొంత కాలము యుద్ధము ఆగినది. తిరిగి 1356 సంవత్సరమున ఇంగ్లీషు రాజుకుమారుడు ఫ్రాన్సులో గొప్ప సేనలతో ప్రవేశించి పాయి టీర్సు పద్ధ ఫ్రెంచి సేనల నోడించి అప్పటి పరాసు రాజగు "జాన్”ను ఖయిదీగ పట్టు కొనెను. 1360 సంవత్సరమున సంధి జరిగెను. ఎడ్వర్డు రాజుకు సంపూర్ణ హక్కులతో పరాసు దేశములోని అక్వీటైను రాష్ట్ర మును, కె లే పట్టణమును ఇచ్చిరి. ఎడ్వర్డు పరాసు దేశపు రాజ్య మునకు హక్కును వదలుకొనెను.