పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
214

ప్రెంచి స్వాతంత్ర విజయము


సభ్యుడు రాజునకుత్తరము వ్రాసిపంపెను. రాండిస్టుమంత్రులను తీసి వేసినందులకు శాసనసభ వారు తమ యసమ్మతిని, దెలిపిరి. కాని రాజు తన దుష్ప్రవర్తనను మాన లేదు. ఇందు మీద రాజును తీసి వేసిన గానీ దేశమునకు సురక్షితము లేదని అతివాదులు ప్రజల కుపన్యాసముల నిచ్చిరి. పత్రికలలో వ్రా యుచుండిరి. క్లబ్బులలో తీర్మానించుచుండిరి. సంపూర్ణ ప్రజా స్వామ్య వాదుల పలుకుబడి ప్రజలలో బాగుగ వృద్ధి చెందెను, ప్యారిసుసగర మ్యునిసిపల్ అధ్యక్షుడును, సభ్యులును ఈ కక్షి లోనే చేరియుండిరి.

(4)

రాజును తీసి వేయ
వలెనను యత్నము.

జూన్ 20 వ తేదీ జాతీయ సభ్యులు టెన్నిసుకోర్టు శపదమును తీసికొన్న దినము. . 'దాని సంవత్సరోత్సవము పేర ప్యారిసు లోని ముప్పది వేలమంది జనులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు జాతీయ గీతములను, విప్లవ కీర్తనలు పాడుచు శాసన సభా మందిరమునకు వచ్చిరి. స్త్రీలు, పిల్లలు బాగా తీయగీతములను విప్లవకీర్తనలను పొడుచు, శాసని సభామందిరమునకు వచ్చిరి. ప్రజాసమూహము యొక్క - నాయకులు శాశన సభ కొక అర్జీ నిచ్చుచు ' రాజు తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తిం చుచున్నాడు. ప్రజా నురంజకులగుమంత్రులను దీసి వేసినాడు. జాతి యొక్క సౌఖ్య మొక మనుష్యని దయ మీద నాధార పడదగినంత తేలికైన వస్తువు కాదు. దేశము నీ యపా య స్థితి నుండి తప్పించుటకు వారు వెంటనే పూనుకొను' డని' చెప్పిరి. ఈ సంగతి తాము జాగ్రత్తగా నాలో చింతు మనియు, ప్రజలల్లరులు చేయకుండ తిరిగి యండ్ల కేగవలయునని కోరుచు