పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215

పదనాలుగవ అద్యాయము


న్నా మనియు శాసనసభాధ్యక్షుడు చెప్పెను. ప్రజలక్కడ నుండి పోయి రాజమందిరములో ప్రవేసించిరి. రాజు ధైర్య ముగా తలుపులు తీయించి ప్రజలను రానిచ్చెను. జాతీయ భటులు ప్రజలల్లరి చేయకుండ కాపాడిరి. రాజు ముందుకు వచ్చి ప్రజలిచ్చిన జకోబినులు ధరించెడి ఎర్ర టోపీని ధరించెను. వారిలో నొక రిచ్చిన ద్రాక్ష సారాయయుమును త్రాగెను. ప్రజలు సంతృప్తినొంది వెళ్ళిపోయిరి.


శాసనసభలో రాజును తీసి వేయవలెనని గిరాఁ డిస్టు కక్షీ సభ్యులు కూడ చెప్పసాగిరి. వెర్నాడను సభ్యుడు దేశము యొక్క అపాయస్తితిని వర్ణించి, దీనికంతకును రాజును, ఆయన సలహాదారులును జవాబుదారులని, సభ్యుల మనంబులు కరుగునట్లు పన్యసించెను. బ్రిస్సో "రాజును, ఆయస సలహాదారులను ఫ్రెంచి జాతిని ఆటబొమ్మవలె త్రిప్ప యత్నించుచున్నా ”రని చెప్పెను. యుద్ధము ముగియువరకును శాసనసభ ఎడతెగకుండ సమా వేశమగునట్లు, తీర్మానించిరి. సభ్యులు రాష్ట్రములకు పోయి ప్రజలను పురికొల్పి సైన్యములలో జేర్చి. యుద్ధము సకు దృఢప్రయత్న ములను వేసిరి

రాజును
ఖైదు చేయుట,

1792 సంవత్సరము జూలై 25 వ తేదీన ప్రష్యా సేనాధి పతియగు బ్రన్సువి క్కు ప్రభువు పదునారవ లూయీ రాజు గోల్పోయిన హక్కులను తిరిగి యిచ్చుటకయి తాము వచ్చుచున్నామనియు, లూయీ రాజుకు వ్యతిరేకముగా నుండు వారి నెల్ల కాల్చి వేయుదుమనియు యూరపు రాజులతరపున ప్రకట