పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ఆధ్యాయము

5

మనము అణచుట, గాలుల లుగావున కొంతవరకు గాలు దేశములోని ప్రజలకును నాగరిక తను నేర్పిరి. రోమనుల భాషయగు లాటినును పాఠశాలలలో నేర్పిరి. లాటీను భాపలో పండితులు కవులు చరిత్ర కారులు వక్తలు గాలులనుండీ బరులు దేరిరి.రోమనుల ఆచార వ్యవహారములను గాలులు నేర్చుకొనిరి.

మతమునణుచుట

కాని రోమములు గాలుల మతము నణచి వేసి తమ మతమును వ్యాపించుటకు యత్నించిరి. రోమ కచక్రవర్తులు గాలుల మతగురువులగు డ్రూయియిడులను మతబోధ చేయగూడదని శాసించిరి. డ్రూ యిడుల మతము సవలంబంచువారికి మగణశిక్ష విధించెదమని కూడ శాసించిరి. డ్రూయియిడు మతస్థులకు ఘోర శిక్షలు విధించి అమత మును రూపుమా ఫుటకు యత్నించిరి. ఇంతలో క్రైస్తవ మత బోధ గాలులో కూడ బయలు దేరెను. రోమక చ క పగులప్పటికి క్రైస్తవులు గారు. 'క్రైస్తవమతమును స్వీకరించిన వారికి ఘోర శిక్షలు విధించుచుండిరి. క్రీస్తుశకము 177 సంవత్సరమున లయన్సు పట్టణములోని నలుబది యెనిమిది మంది క్రైస్తవులను సింహముల కాహారముగ సర్పించిరి. ఒక స్త్రీని శిశువుతో కూడ నురిదీసిరి. ఇంతటితో క్రైస్వ మతబోధ ఆగెను. " తిరిగి క్రీస్తు శకము 250 వ సంవత్సరమున నేడుగురు మతాచార్యులు గాలులో క్రైస్తనమతబోధను ప్రారంభించిరి. వీటి నందరను రోమక ఉద్యోగస్థులు ఘోరహత్యలపాలు చేసిరి. ఒకరిని ఆంబోతు చేత చంపించిరి, కొందరిని బావులలో పడదోసిరి. మరి యొకరిని ఎఱ్ఱగా కాలిన యినుపగొలుసులచే జంధించి,