పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
6

ప్రెంచిస్వాతం త్య విజయము

.


తాత్కాలికముగా క్రైస్తవ బోధ యణచి వేయబడినది. పవిత్రమయిన క్రైస్తవమతబోధ నిర్బంధములచే చిరకాల, మణచివేయుట దుస్సాధ్యమయ్యెను.

మత సహనము లేకుండుట

తుదకు క్రీస్తుశకము 330 వ సంవత్సరమున రోమక చక్రవర్తి యగు కాంస్టాంటైన్ క్రైస్తవమత మును స్వీకరించెను. దీనితో క్రస్తవమత మునకు గొప్పు రాజ పోషణము కలిగెను. కాని క్రైస్తవమత మును స్వీక రించక పూర్వము రోమక రాజులే దుష్ట శాసనములచే క్రైస్తవమతము నణచయత్నించిరో ఆదుష్టశాసనములవలన నె క్రైస్తవ నుతమును స్వీకరించిన రోమక రాజులు క్రైస్తవ మతముకాని యితర మతములను నాశనము చేయయత్నించిరి. క్రీస్తుశ కము 386వ సంవత్సరమున థియోరోసియను చక్రవర్తి తనరాజ్యములో క్రైస్తవమతముతప్ప నేయితరమతము నవ లంబించినను యజ్నములు చేసినను మరణశిక్ష విధించబడు శాసించెను. రోములో చిరకాలమునుండి యారాధించబడు చున్న దేవతలయా రాధనను బలపంతముగా నాపు చేయించెను. రోమక రాజ్యములోని క్రైస్తవులు కాని వారి సుందరమగు దేవాలయములన్నియు పడగొట్టించి యాచలువ రాళ్ళతో క్రైస్తవ దేవాలనుములను నిర్మించెను. కొన్ని దేవాలయములలోని విగ్రహములను పీకీ వైచి వానిలో క్రైస్తవారాధసను నెలకొల్పెను. ఇతర మతస్తులు వ్రాసిన కవిత్వము, చరిత్రలు, తత్వ శాస్త్రము, మొదలగు గ్రంథములను క్రైస్తవ చక్రవర్తి నాశ నము చేయించెను.