పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
146

ఫ్రెంచి స్వాతం త్య విజయము

నమును తయూరుచేసి యియ్యవ లెనసి రూసోను కోరిరి. కాని కొలది కాలములో మోట యర్సునుండి కూడ రూసో పారిపో వలసివచ్చెను. అచటి జనులు రోమసు కాథలిక్కు క్రైస్తవులు. మతగురువుల పలుకుబడిలో నుండి, రూసో 'ఎమిలియసు' అను గ్రంథములో క్రైస్తవమతములోని కొన్ని మూఢ విశ్వాసములను ఖండించి, క్రైస్తవ మతగురువులు మతము పేర చేయుచున్న అక్రమములను, తీవ్రముగా విమర్శించి, సర్వమతములకును సమాన గౌరవ స్వాతంత్యములు కావలెనని వ్రాసెను. ఈగ్రంధమును తగుల బెట్టవలెనని ప్యారిసులోని ప్రధాన క్రైస్తవాచార్యు డాజ్ఞాపించెను. రూసో నాస్తికుడని, యు క్రైస్తవమతము నుండి వెలి వేసితి మనియు ప్రకటించెను. స్విట్జర్లాండులోని క్రైస్త ఎమతగురువులు రూ సోపండితుని దూషించుచు వ్రాసిన కరపత్రములు మోటియర్సు గ్రామము చేరెను. మోటియర్సులోని రోమను కాథలిక్కు మతగురువు "నా' స్తికుడగు” రూసో పై ప్రజలలో నాగ్రహము కలిగించెను. రూసో నిజముగా నాస్తికుడు గాడు. త్రత్వమును సమ్మక ఒక్కడగు భగవంతుని సమ్మువాడు. అయినను క్రైస్త వగురువు, లీయనను నాస్తికుడనిరి. మోటియర్సుప్రజలు రూసోను చం పుటకు యత్నించిరి. రూసో తన భార్యతోగూడ అచటినుండి పారిపోయి, స్విట్జర్లండు దేశములోని జర్ని పట్టణపు పాలనలో చేరిన చాల కొద్దియిండ్లుగల యొక చిన్న ద్వీపములో నివసించుటకు వెళ్లెను. కాని కొద్దిరోజులలో బర్ని ప్రభుత్వము వారు అచటినుండి. పదునైదుదినములలో, లేచిపోవలసినదని రూసోకు ఉత్తర్వు