పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145

పదయవ అధ్యాయము

అను పద్యములలోని భావములనే ఫ్రాన్సు దేశవు మహా గ్రంథ కర్తయగు రూసో కూడ తెలిపియున్నాడు. సుప్రసిద్ధుడగు గంధ కర్తను అతని యభిప్రాయములతో నేకభవించ నంతమాత్ర ముచేత కష్టములపాలు సేయుట అవి నీతీయని ఫ్రెడరిక్కు రాజు తలంచి తన రాజ్యములో రూసో కు నిలువనీడ నిచ్చెను. ప్రష్యాలోని యొక సరస్సుయొడ్డనున్న 'మోటియర్సు అను నొక చిన్న గ్రామములో రూసో యొక చిన్న కుటీ మును నిర్మించుకొని తన భార్యతోగూడ కాపురముండెను. అచటి సృష్టి సౌందర్యములకు మిగుల సంతసించు చుండెను. అచటి అడవులలోను కొండలలోను సంచరించుచుండెను, తనకు ఆత్మశాంతి కలిగినదని ఆయన ఎంచెను. తన పుస్తకములు కొనిన వర్తకుడు తనకు పంపుచున్న నెలకు పదునారు రూప్యముల రాబడితో ఆయన తృప్తి నొందెను. మరియు ఆయసము ఆయని భార్యయుచేతితో జగీని తయారుచేసి విక్రయించి నెలకు అయిదారు రూప్యములను సంపాదించు చుచుండిరి. యూరపు యొక్క అన్ని జాతులకు చెందిన ప్రజ లేమి, విద్వాంసు లేమి, ఇన్ని ప్రభుత్యముల వారి చే బహిష్క రింపబడిన ఈ ప్రఖ్యాతపురుషుని దర్శించుటకు పచ్చుచుం డిరి. అనేక విషయములలో ఆయన యభిప్రాయముల నరయు చుండిరి. తన నాలుగు నెలల కుమార్తెను ఎటుల పెంచవలె నని వర్టెంబర్గు ప్రభువు రూసోపండితుని యభిప్రాయము కను గొనెను. నేమ ప్రభుత్వము పై తిరుగబడి ప్రజాస్వామ్యము నేర్పచు కొనిన కార్సికను ప్రజలు తమకొక రాజ్యంగవిధా