పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
139

పదియవ అధ్యాయము


ణాలయమున నప్పగించెను. బీదలతోనే నీతిమంతమైన మనుషత్వము గలదనియు, నందులకు వలన బీదలుగనే తనపిల్లలు పెరుగ వలయుననియు, అట్లు పెరిగి స్వయముగ కష్టపడి సంపా దించుకొను దానితో డనే........ కదలనియు ఆయన తలంపు , ఆయన మిగుల స్వతంత్రుడును, స్వభావ ప్రతిసాధకుడు నగు గ్రంథకర్త . పదునిమిదవశతాబ్దములోని ఫ్రాన్సు దేశ ప్రజలను రూసో గ్రంథము నుద్రేక పరిచినంతగ మరి యేరి గ్రంథములు నుద్రేక పణుపలేదు. ఈయనగ్రంథములు మిగుల తీవ్రభావములుగలిగి, యుద్రేక పూరితములై ప్రజా సమూ హముల హృదయములను పూర్తిగ నాకర్షించెను. ఎల్లప్పు డును రాజులును, ప్రభువులును మనయంర్య ద్వేషమును ప్రజా సమూహము లీయన యందత్యంత గౌరవమును, గలిగి యుండిరి. ఈయన విశేషముగా తోటలలోను కొండలలోను అడవుల లోను: శలయేళ్ళ వద్దను పచ్చిని బయళ్ళమీదను ” కాలము గడుపుచు సృష్టి సౌందర్య ముల సత్యధిక ముగ ప్రేమిం చును. మనుష్యుల సొంగత్యము నుండి దూరముగ నుండుటను ఒంటరి తనమును కోరుచుండెను. మానవులను నాగరికత యనునది వైజధర్మములనుండి దూరముగ జేసి మాలిన్యమును కలుగ జేసినదనియు, నాగరికత యను విషవృక్షమును సరకి వైచి మానవులు స్వచ్చమగు సహజస్వభావమును తిరిగి పొంది, సృష్టికర్త యొక్క యుదేశ్యములను నెరవేర్చవలెవ్బ్ననియు నా యనముఖ్య సిద్ధాంతము. “సృష్టిలో అందరు సమానులు, ఎక్కువ తక్కువలు లేవు. స్వభావముగ, నీతిగలవారు, శరీర