పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

133

పదియవ అధ్యాయము

ప్రజలలో వ్యాపించిన భావములకును సంబంధము లేకుండెను." దేశ్ ములో పదుమూడవశ తాబ్దపు ప్రతిష్టాపనలు, ఆచార ములు: నిలిచి యుండెను. ప్రజలలో పదు నెనిమిదవ శతాబ్దపు కోరికలు, భావములు వ్యాపంచియుండెను. కావున గొప్పవిప్ల వము రాక తప్పదని తలచుచుండిరి. పదు నేనవలూయి రాజు 'మా తరువాత ప్రళయము వచ్చు 'నని చెప్పుచుండెను.

గ్రంథకర్తలు

ఆ కాలమున ఫ్రెంచివాగ్మయము కవిత్వము తోడను భాషావిషయిక గ్రంధముల తోడను తృప్తిచెందక, సమస్తవిధము లగు గ్జ్నానవ్యాపకమునకు తోడ్పడిన, ప్రజాక్షే మముకొఱకు మిగులసమర్తులగు వారు గ్రంథ ములను వ్రాసి. సంఘములోని లోపములను వెక్కిరించుటకు మా రుగ సంస్కరించు పద్ధతులను సూచించిరి. వాగ్మయమును సా ధనముగ గొని విద్వాంసులు తమయభిప్రాయములను వ్యాపింప జేయ యత్నంచిరి, చుట్టును వ్యాపించియున్న ఘోరమగు అక్ర మములు, అవినీతికరమగు ప్రవర్తనలు, అమాసుషమగు అసమా సత్వము', విశేషమగు దౌర్భాగ్యము వీనిం గూర్చి విమర్శించుట కు బూనుకొనిరి. రాజు యొక్క మంత్రులలో గూడ కొందరు ప్రభుత్వమున గొప్ప సంస్కరణములు కోరుచు గ్రంథములను వ్రాసిరి. 1789వ సంవత్సరముననే అర్గెన్ సన్ ప్రభువు. రాచ కీయసంస్కరణములను కోరుచు నొక గ్రంధమును వ్రాసి "ఈ గ్రంథములోని సిద్ధాంతములు ప్రజాపాలసమున కను కూలముగా నున్నవిషయు, ప్రభు పరం పర యొక్క నాశనమునకు తోడ్పడునని