పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
132

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

పుట్టుక వల్ల తమకన్న నధికులమనీ యెంచుచు తమ్మునీచముగ చూచుచున్న ప్రభువులయందును ద్వేషమును గలియుండి రి'. ప్రభువులలో కూడ కొందఱు నూతన స్వాతంత్య భావములను పొంది యుండిరి. చిన్న మతగురువులను చాలవరకు సామాన్య ప్రజలభావములనే కలిగియుండిరి. పట్టణములలో మారిన భావములు తీవ్రముగా వ్యాపించినవి. పదు నేసవలూయి రాజు సుమారు అరువది సంవత్సరములు రాజ్యము చేసెను. అంత దీర్ఘ పాలనమున ప్రాజానుకూలముగు ఎట్టి సంస్కరణములును జరుగక పోగా, రోజురోజుకు ప్రభుత్వము ప్రజలు విశ్వాసమును కోల్పోయి దేశములో తివ్రమగు అసంతృప్తి, ఆందోళనము వ్యాపించి యుండెసు.

(2)

స్వాతంత్ర్యభా
వములవ్యా పనము

ఈ దీర్ఘ కాలసమున ప్రభుత్వపద్దతులను సాంఘిక అస మానత్వమును విమర్సించుచు వ్రాసినగ్రంథకర్తలు పెక్కడ్రు బయలు దేరిరి. పదునేడవ లూయి రాజు యొక్క పసితనము నందున్న సంరక్షకులును తరువాత నా లూ యీ రాజును దుర్వ్యసనములలో జక్కుకొని మొత్తము మీద నితర విషయములలో సుపేక్షా భావము వహించి యుం డినందున, అకాలమున మానవ స్వాతంత్యమునుగూర్చియు, మత, సాంపిక, ఆర్థిక, రాజకీయ విషయములమీదను అనేక గ్రంథములును, ప్రకృతిశాస్త్రములును బయలు విడలి దేశము నందంతటను స్వతంత్రోభిలాషను వ్యాపింపజేసెను. కావున అప్పుడు నిలిచియున్న ప్రతిష్ఠాపనలకును, ఆచారములకును