పుట:February 2020.అమ్మనుడి.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షుడు బి.హనుమారెడ్డి హఠాన్మరణంతో విషాదంగా ముగిసిన

ప్రకాశం జిల్లా రచయితల సంఘం 9వ రాష్ట్రస్థాయి రచయితల మహాసభలు

వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కవులు, రచయితలు తమ కలాలను పదునెక్కించాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉవకులవతి ఆచార్య ఎస్‌. వి.సత్యనారాయణ పిలుపునిచ్చారు. జనవరి 17న ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యాకేంద్రంలో ప్రారంభమైన ప్రకాశం జిల్లా రచయితల సంఘం 9వ రాష్ట్రస్థాయి రచయితల మహాసభల ప్రారంభోత్సవ నభలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రరనం అధ్యక్షుడు బి.హనుమారెడ్డి అధ్యక్షత వహించారు.

అదే సభలో ప్రరసం నూతన అధ్యక్షుడుగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పొన్నూరు వేంకట శ్రీనివాసులు పేరును స్వయంగా హనుమారెడ్డి ప్రకటించారు -తాను అధ్యక్షుడిగా, శ్రీనివాస్‌ కార్యదర్శిగా ఇంతకాలం కొనసాగామని, ఇకపై శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు.

18వ తేది ఉదయం జరిగిన సాహిత్య సభకు అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, రచయిత ఎం.వి. రామిరెడ్డి 'తెలుగులో రైతు కవిత్వం' పై ప్రసంగించారు. 'తెలుగు కథలో సాంఘిక జీవనం' అనే అంశంపై ప్రముఖ కథారచయిత, విమర్శకులు విహారి ప్రసంగించారు. సాయంత్రం జరిగిన సాహిత్య సభలో ఆచార్య అయ్యగారి సీతారత్నం 'పోతన కవిత్వంలో స్త్రీ పాత్రలు', ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ “అభ్యుదయ కవిత్వంలో అస్తిత్వం” అనే అంశంపై ప్రసంగించి కవులు, రచయితలలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.

19వ తేది ఉదయం మహాసభల్లో విషాదం ఆవరించింది - ప్రరసం అధ్యక్షుడు బి. హనుమారెడ్డిగారికి తెల్లవారు రూమున గుండెపోటు రావడంతో చికిత్సకోసం హాస్పిటల్‌లో చేర్చడం, ఆయన ఉదయం 8.80 ని॥లకు మరణించడంతో ఉదయం డా॥ సామల రమేష్‌బాబు అధ్యక్షతన జరగవలసిన 3వ సాహిత్య సభ హనుమారెడ్డి సంతాప సభలా మారింది. డా॥ సామల రమేష్‌బాబుతో పాటు డా॥ శిఖామణి, డా॥ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డా॥ చిల్లర భవానీ దేవి, ఇడమకంటి లక్ష్మీరెడ్డి అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, పాటిబండ్ల ఆనందరావు, మాజీ శాసనసభ సభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌ ప్రరసం నూతన అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు, కోశాధికారి మత్తపు కొందారెడ్డి, కార్యవర్గ సభ్యులు - హనుమారెడ్డిగారికికి ఘన నివాళులర్చించారు. అనంతరం ప్రతినిధులుగా సభలో పాల్గొంటున్న 500 మంది కవులు, రచయితలు ఊరేగింపుగా వెళ్లి హనుమారెడ్డి భౌతిక కాయాన్ని దర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

క్రిందటిరోజు స్వయంగా ఫోన్‌ చేసి పలుకరించి, నా ప్రయాణాన్ని ఖాయపరచుకొని, రైల్వేస్టేషన్‌కు కారును పంపించిన మిత్రుడు హనుమారెడ్డిగారు, నేను ఒంగోలులో లాడ్జిలో దిగిన సమయంలోనే శాశ్వతంగా కన్నుమూశారట. నేనూ, మిత్రులూ సిద్ధమై సభకు బయల్దేరే సమయానికి ఈ వార్త అందింది. నేరుగా వారింటికి వెళ్లి ప్రాణం లేకుండా పరుండి ఉన్న ఆప్తుడిని చూచి చలించిపోయాను. ఇంతకంటె నాకేం శిక్షను విధించగలరు మిత్రమా?! మీ తోడు దూరమైన నాకు తెలుగు భాషోద్యమంలో ముందుకు సాగడం - కీలక నిర్ణయాల సందర్భాల్లో ఎంత కష్టమో మీకు తెలుసు. అంత తొందరపడాలా మిత్రమా...

మిమ్మల్ని మరువలేని - మీ - సామల రమేష్‌బాబు వలరలాల పత్రిక ఇమ్మనుడె ఫ్యబ్రవరి-2020 |