పుట:February 2020.అమ్మనుడి.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపుటి: 5 సంచిక: 12 అమ్మనుడి ఫిబ్రవరి 2020

ఉద్యమాలతోనే అమ్మనుడుల సాధికారిత

మళ్లీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఎల్లనాడుల అమ్మనుడుల పండుగదినం) వచ్చేస్తున్నది. 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ భాషీయులు తమపై పెత్తనాన్ని చెలాయిస్తున్న పశ్చిమ పాకిస్తాన్‌ పాలకులను 'మా భాషలోనే మా బ్రతుకులు వికసించాలనీ, పరాయి భాషీయులు తమ మతస్తులైనా వారి పాలనను నహించబోమనీ' ప్రకటించి, వీధులలోకి వచ్చి నినదించిన ఫలితంగా కాల్పులకు గురై ప్రాణాలను కోల్పోయిన రోజు అది. తర్వాత 20 ఏళ్ళకు ఆ ఉద్యమం పరాకాష్టకు చేరుకొని స్వతంత్ర ప్రకటనకు దారితీసి స్వతంత్ర దేశంగా “బాంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఇప్పుడా దేశంలో కూడా మతతత్వం ప్రబలి, ఇతర మతాల పౌరులకు భద్రతలేని స్థితి ఏర్పడుతున్న సంగతిని అలా ఉంచండి. అది వేరే విషయం. తమ మాతృభాషను మాత్రం నాటికీ నేటికీ వారు విస్మరించలేదు. మతానికీ, భాషకూ సంబంధం లేదని, బంగ్లాదేశ్‌ ఆచరణలో చూపించింది. ఇది అత్యంత సహజమైన విషయం. ప్రపంచంలోని ఎన్నో దేశాల, జాతుల, భాషల పరిణామాల్ని గమనిస్తే, చేతివేళ్లపై లెక్కించదగినన్ని మతాలను, రెండు వందలకు మించని దేశాలను, ఏడు వేలకు పైగా ఉన్న భాషలను లెక్కలోకి తీసుకోవాలి - ఇంతటి వైవిధ్యాన్ని మనం గుర్తించాలి. కనుక ఎక్కడ ఎటువంటి ఆధిపత్య భావజాల విస్తరణ, అణచివేత ప్రయత్నం జరిగినా సంఘర్షణ తప్పదు. కనుకనే భాషలకు - మతాలకు, మతాలకు - దేశాలకు, దేశాలకు - భాషలకు ఏర్పడే సంఘర్నణలేవైనా జాతుల పోరాటాలుగా విస్తరిస్తాయి. ఈ సంఘర్షణలను, పోరాటాలను నివారించడం కోసం అన్ని భాషల సమానత్వాన్ని మనం గుర్తించాలి. ఎక్కడా ఏ రూపంలోనూ ఎటువంటి ఆధిక్యతాభావమూ చోటు చేసుకోకూడదు. చిన్నచిన్న సంఘటనలైనా సమాజ శాంతిని, ప్రగతిని దెబ్బతీస్తాయి.

దేశంలోని వారందరూ ఒకటే జాతివారమని అంటూనే కులాల, మతాల, భాషల ఆధిపత్య భావజాల ప్రదర్శన నిరంతరం జరుగుతూనే ఉంది. జాతి, మతం అనే మాటలు ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయి. సహజంగా జాతి అంటే ఒక భాషాజుతి అని అర్థం. ఒకే ప్రాంతంలో విభిన్న భాషల వారు కలిసిమెలిసి బ్రతుకుతున్నప్పుడు వారంతా ఫలానా దేశీయులమనే ఐక్యతా భావాన్ని కలిగి వుంటారు. ఈ సందర్భంలో కూడా జాతి అనే మాట వినియోగంలో ఉండవచ్చు. భారతజాతి అనే మాటనే తీసుకొందాం. ఒక భౌగోళిక జాతిగా, అనంతమైన చరిత్ర కలిగి వున్న ఈ దేశంలో చరిత్రగతిలో ఎన్ని మానవ స్రవంతులు వచ్చి చేరినా, విస్తృతంగా ఈ ప్రజలందరినీ కలిపి భారతజాతి అని అనడం వాడుకలో ఉంది. అంతేకాదు, ఉత్తరభారతంలోనూ, తమిళనాడు వంటి చోటుల్లోనూ 'జాతి' కులాన్ని సూచించేమాట! జాతి అనే మాట ఇంత వైవిధ్యంతో వాడుకలో ఉన్నప్పుడు మనం దీన్ని వినియోగించేటప్పుడూ, విమర్శించేటప్పుడూ కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. తెలుగుజాతి అనే పదానికి స్ఫష్టమైన అర్ధం 'తెలుగు భాషాజాతి' అని. ఇది భారతదేశంలో అంతర్భాగం. తెలుగుభాష పుట్టుక, వికసించడం - అంతా ఇక్కడి జనవాహినిలోనే. అలాగే ఇతర దేశీయ భాషలూనూ.

ప్రపంచంలోని జనభాషలన్నిటిలో ఎక్కువ భాషలున్నది మనదేశంలోనే. వీటిని మాట్లాదేవారి జన సంఖ్యను బట్టి కొన్ని పెద్దవీ, అనేకం చిన్న చిన్నవీ ఉండవచ్చు. 22 భాషల్ని మన రాజ్యాంగం అధికారభాషలుగా గుర్తించింది. ఇంకా కొన్ని భాషలు గుర్తింపుకోసం పోరాడుతున్నాయి. రాజ్యాంగంలో గుర్తించబడిన భాషలన్నిటినీ జాతీయ భాషలుగా గుర్తించాలనే కోరిక బలంగా ఉంది. అయితే వీటి అభివృద్ధికి కేంద్రం ఎంత సహాయపడినా, ఆ భాషా జాతీయులు, రాష్ట్రాల ప్రభుత్వాలు తమ భాషలను ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి పరచుకోవడం, వినియోగించడంపైనే వాటి వికాసం ఆధారపడి ఉంటుంది. అంతేగాదు, ఆధునిక సాంకేతికతను పూర్తిగా | తెలుగుజాతి పత్రిక జువ్మునుడి. ఆ ఫిబ్రవరి -2020 |