పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

165


ప్రకటింపబడు వార్తాపత్రిక. చందా సం. 1కి 2 పేపర్లకు 1-00. తపాలాకూలి 0-13-00. ఆరునెలలకు నెల్లూరువారు 0-10-0, బయటివారు 1-0-0 యివ్వవలెను. పోషకులకు సం 1కి రూ 10 లు, సహాయులకు రూ 5/- లు. వలయువారు పై వారికి వ్రాసికొనవలెను.” (ఈ ప్రకటన కళావతి ఏప్రిల్ సంచికలోనూ ఉంది)

అనుబంధం-9

Classified catalogue of the Public Reference Library - containing of books registered from 1867 to 1889 - Office of the Registrar of Books - old Catalogue, Madras 1894.

1) Page 83, Registration No. 15 - Hindu marriages - being a reprint of those letters upholding Infant marriages among the Hindus - letters on - year 1867 Quarter 3,4; No. of Edition-1; Name of the Author : D. Narasaiya

2) History - Registration No. 41 Historical Sketches of the British Empire in India, compiled from the Illustrated London News of 1857 - Year 1867 - Quarter 3,4 No. of Edition : 1 Name of the Author : D. Narasaiya

3. Page 16 Registation No. 27 Essentials of English grammar. Year 1871 Q4

4. Registration No. 25 Essentials or a First book of English Grammar in easy Telugu - Year 1883 Q2 No. of Edition 2; Author : D. Narasaiah.

అనుబంధం-10

శ్రీరామ

9.3.98.

My Dear Brother, యిచ్చట అందరు క్షేమం. నగ (ల) పోవిడి రాలేదు అని వ్రాస్తివి. మన వంటి దురద్రుష్టవంతులకు పోయ్ని ద్రవ్యము వచ్చునా? మనకు యిపుడు (నిండా) క్రూరకాలము. సొమ్ముపోయి దిమ్ముపట్టినది అని సామెత చెప్పుదురు. యిప్పటి మనస్థితి ఆ మాదిరిగా నున్నది. స్వామి చిత్తంప్రకారం జరగవలెను. మన కుప్పన్నను మళ్ళ వేశి అచ్చటనే నిలుపుకొనే విషయంలో అందర్కి యిష్టమేను. కాంతమ్మ కూడా నాతో చెప్పి వ్రాయమన్నది. మనమందరం సమీపంలో వుంటే బాగా వుండును అని నా బుద్ధికి కూడా తోస్తున్నది. కలిసి మాట్లాడితేగాని యీ విషయం తేరుగడ కాదు. మన చెంచమ్మకు కొంచెం నెమ్మదిగా వున్నది. మందు యిప్పిస్తున్నాను. కామాక్షయ్య