పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

దంపూరు నరసయ్య


కుమారులను మద్రాసులో చదివించి పట్టభద్రులను చేశాడు. చాలాకాలం హిందూ, స్వతంత్ర, స్వరాజ్య పత్రికలకు విలేకరిగా పనిచేశాడు. జమీందారీ వ్యతిరేక పోరాటం ఉద్దృతంగా జరుగుతున్న రోజుల్లో రాజాలకు వ్యతిరేకంగా రాయడం మనస్కరించక పత్రికా విలేకరిగా మానుకొన్నాడని తెలుస్తూంది. తండ్రి ఉదారభావాలు రామకృష్ణయ్యను ప్రభావితం చేశాయి. స్వాములవార్లు, పాదపూజలు, తీర్థయాత్రలు మొదలైన వాటికి దూరంగా, నిర్లిప్తంగా ఉండేవాడట. రామకృష్ణయ్య 1949లో పుట్టినరోజే, అరవయ్యో ఏట మరణించాడని తెలిసింది.

1. ఈ రచయిత చాలాకాలం క్రితం పుస్తకాన్ని చదివాడు. భ్రమరాంబ నవల 'ప్రజామిత్ర' ప్రచురణ పేర 1912లో పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్, వెంకటగిరిలో ప్రచురించబడింది.

2. బి.వి. కుటుంబరావు, ఆంధ్ర నవలా పరిణామము, పుట 213.

3. P. Subbaramaiah, P. Janakiramaiah, A manual of Mathematics, Part 1 (Experimental Geometry) The People's Friend Press, Venkatagiri Town 1910; అల్లసాని పెద్దన మనుచరిత్రము, ప్రథమభాగము (నోట్సుతో సహా) ప్రచురణకర్త - బి. రామకృష్ణయ్య, పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్, వెంకటగిరి టౌన్, 1910.

అనుబంధం-7

“వెంకటగిరి లేట్రాజాగారు నెల్లూరు కాపురస్తులగు హాజీ మహమ్మదు రంతుల్లా సాహెబులవారి కనుకూలముగా వ్రాసి యిచ్చిన మరణ శాసనమును గురించిన యపీల్ వ్యాజ్యమును గురించి కొన్ని విషయములు మరల విమర్శించుటకై పై వ్యాజ్యమునకు సంబంధించిన కాకితములం బంపుడని కోర్టు వారిని ప్రార్ధించఁగా వేసవి సెలవులు ముగిసిన వారము రోజుల లోపల బ్రతిపక్షుల ఖర్చుల నెల్లం గోర్టునందు జెల్లించినంగాని సాహెబులవారి ప్రార్థన ప్రకారం పునర్విమర్శనార్ధమై యందుకు సంబంధించిన కాకితములు పంపబడవనియు, మటియు నపీల్ తీసివేయుటయే కాక మీదు మిక్కిలి యెదిరివాదులగు నిప్పటి శ్రీవేంకటగిరి రాజాగారి ఖర్చులు యావత్తు నచ్చుకొనవలసి యుండుననియు, నున్నత న్యాయస్థానాధిపతులగు సర్టీముత్తుస్వామి అయ్యరుగారున్ను జె. డబ్లియు. బెనట్ దొరగారును సెలవిచ్చిరట. ఇటని పీపుల్స్ ఫ్రెండ్ వాక్రుచ్చుచున్నది.” (పత్రిక పేరు, వివరాలు ఉన్న భాగం నోట్సులో క్రిమిదష్టమయింది-రచయిత)

అనుబంధం-8

కళావతి సంపుటం 3 సంచిక 3, మార్చి, 1901.

“ఆంధ్రభాషా గ్రామవర్తమాని. ఇది తెలుగు జిల్లాల పల్లెటూళ్ళ జనులకుగాను సులభశైలిలో నెల్లూరు నుండి దంపూరు నరసయ్యగారిచే ప్రతి శనివారమును