పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

163


DAMPOOR FAMILY

Ramalakshmamma Birth.......: Death 30-9-1913 భాద్రపద బహుళ 12లు.;

Dampoor Narasaya garu - Birth 1848 or 1849 - Death 28-6-1909 (ఆషాఢ శు 11 లు)"

అనుబంధం-6

రామలక్ష్మమ్మ

నరసయ్య భార్య రామలక్ష్మమ్మ. ఈమె కూడా అవధానం పాపయ్య వంశంలో జన్మించింది. ఈమె చదువుకొన్న స్త్రీ అని నరసయ్య దినచర్యల వల్ల తెలుస్తూంది. నరసయ్యను శ్రద్ధగా చూచింది. ఈమెకు, నరసయ్య అక్క మీనాక్షమ్మకు పడకపోవడంవల్ల ఎప్పుడూ కుటుంబంలో అశాంతి నెలకొని ఉండేది. నరసయ్య పోయిన నాలుగేళ్ళకు ఈమె చనిపోయింది.

బి.ఆర్.కె

నరసయ్య తన కుమారుణ్ణి దినచర్యలో బి.ఆర్.కె. అని పేర్కొన్నాడు. పూర్తి పేరు భట్టారం రామకృష్ణయ్య. నరసయ్య ఏకైక సంతానం. నరసయ్య తన కుమారుణ్ణి నాలుగేళ్ళ వయసులో అక్క మీనాక్షమ్మకు దత్తత చేశాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ, వ్యవసాయం, కోర్టు వ్యవహారాలు చూచుకోడంలోనే రామకృష్ణయ్య బాల్యం గడిచిపోయింది. తండ్రి దగ్గర రాతకోతల్లో మంచి తరిఫీదు పొంది సలహాలివ్వగలిగిన స్థితికి ఎదిగాడు. మైనారిటి తీరగానే కొన్ని నెలలు కోడూరు గ్రామ మునిసిపు బాధ్యత నిర్వహించాడు. కోర్టు వ్యవహారం పరిష్కారమై పొలాలు స్వాధీనం అయిన తర్వాత, వెంకటగిరి ఆర్.వి.ఎం. హైస్కూల్లో చదువు సాగిస్తూ, వెంకటగిరిలో పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ నిర్వహించాడు. తనకు ప్రెస్ పనులన్నీవచ్చు. మెట్రిక్యులేషను చదువుతూ, ఇరవై నాలుగో ఏట 'భ్రమరాంబ' పేరుతో ఒక చిన్న నవల రాసి ప్రచురించాడు.1 “భ్రమరాంబ ఇది కేవలము కథ కాదు. అట్లని పెద్ద నవలయుకాదు. సాంఘికమైన నవల. భ్రమరాంబయను నాయిక చరిత్ర ఇందు వర్ణించబడెను2.”

రామకృష్ణయ్య విద్యార్ధిగా ఉంటూ “ప్రజామిత్ర” ప్రచురణ సంస్థ పేరు మీద “ఎ మేన్యువల్ ఆఫ్ మేథమేటిక్స్” పాఠ్యపుస్తకం, మనుచరిత్ర మూడాశ్వాసాలు (నోట్సుతో సహా) ప్రచురించాడు.3

రామకృష్ణయ్య ట్రైనింగ్ పూర్తిచేసి వెంకటగిరిలో రాజా వెలుగోటి ముద్దుకృష్ణ యాచేంద్ర ఉన్నత పాఠశాలలో జాగ్రఫి టీచరుగా స్థిరపడ్డాడు. ప్రైవేటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. పాసయ్యాడు. ఇంగ్లీషు సాహిత్యం చక్కగా చదివిన పండితుడని, మితభాషి, సౌమ్యుడని పేరు తెచ్చుకొన్నాడు. లౌకిక వ్యవహారాల్లోనూ గట్టివాడు. ముగ్గురు