పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

133


నరసయ్య తన కుమారుడి ఆస్తి వ్యవహారంలో మద్రాసు హైకోర్టులో చేసుకొన్న అపీలు వీగిపోయింది. డిక్రీ బాకీ తీర్చడానికి ఆయన పడ్డ కష్టాలు, ఇబ్బందులు, వ్యవసాయంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఈ దినచర్యల్లో వివరంగా ఉన్నాయి. ఆయన మద్రాసు వెళ్ళినపుడు, వీలుచేసుకొని హిందూ ఆఫీసుకు వెళ్తాడు. ఈ సంగతి 1905 జనవరి 20 దినచర్యలో ఉంది.

"Went to the Hindu Office to see Mr. M. Veeraraghavachariar, but sorry to say he was not present at the office and I was told he had not been to the office for some days. I then went over to ఆంధ్ర - office where also A.C.P. too was not to be seen. Left a chit for the latter. Then went over to Higginbothams - purchased "Uncle John". Then walked over to Moore Market, seeing Sir T. Munro's statue, Rajah Ramaswami Chetty and H. Rest nut, etc., on the way."2

నరసయ్య మిత్రులు, పరిచయస్థులు

నరసయ్య నెల్లూరు వచ్చిన తర్వాత కూడా ఎం. వీరరాఘవాచారితో, సి.కరుణాకర మీనన్‌తో, తరచుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చాడు.3 హిందూ వ్యవస్థాపకుడు వీరరాఘవాచారితో ఇంత గాఢమైన స్నేహం ఉన్నా, దినచర్యలో హిందూ చదివినట్లు ఎన్నడూ రాయలేదు. ఆంధ్రప్రకాశిక అధిపతి ఏ.సి. పార్థసారథినాయుడితో నరసయ్య నెల్లూరు నుంచి ఉత్తరాల ద్వారా స్నేహం సాగించాడు.4 క్రమం తప్పకుండా పోస్టులో నరసయ్యకు ఆంధ్రప్రకాశిక అందేది. దాదాపు రెండు దశాబ్దాలపాటు పత్రికలు నిర్వహిస్తూ, మద్రాసులో ఉండడంవల్ల నరసయ్యకు దేశంలోని వివిధ నగరాల్లో అభిమానులు, స్నేహితులు ఏర్పడి ఉంటారు. 1876 నాటికే పూనాలో పట్వర్టన్ స్నేహితుడైనట్లు ఒక ఉత్తరంవల్ల తెలుస్తుంది. కలకత్తాలోని ఒక సంపన్న కాంగ్రెసువాది నరసయ్య కృషిని అభినందిస్తూ రాసిన ఉత్తరం లభించింది.5 దినచర్యలో నరసయ్య మిత్రుల పేర్లు, పరిచయస్థులపేర్లు వస్తాయి. మద్రాసు క్రిస్టియన్ కళాశాల ప్రధానాచార్యుడు డాక్టర్ విలియం రెవరెండ్ మిల్లర్ (Dr. Reverend Miller William) ను "My friend" అని పలుమార్లు పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య జాబులు, జవాబులు తరచుగా కొనసాగాయి. ఇంగ్లీషు, తెలుగు నిఘంటు కర్త. పి. శంకరనారాయణ "పీపుల్స్ ఫ్రెండ్స్ సంపాదకులు శ్రీ దంపూరు నరసయ్యపంతులుగారికి గౌరవ పురస్సరంగా” అని రాసి బహూకరించిన నిఘంటువు ఇప్పుడు కూడా ఆయన వారసుల వద్ద ఉంది. నరసయ్య మద్రాసు మిత్రులు పి.కృష్ణస్వామి బి.ఏ. బి.ఎల్., క్రైస్తవ మిషనరీ రెవరెండ్ ఏ. మోఫెట్ (?), గోపతి నారాయణచెట్టి, గోపతి వరదరాజులుచెట్టి. చివరి ఇద్దరు మద్రాసులో సంపన్నులైన