పుట:Dvipada-basavapuraanamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37

కాన యిన్నియుఁ జెప్పఁగాఁ బని లేదు
దాన సందియమె గౌతముని దధీచి
వ్యాసుని శాపంబు వహ్నిపాలైన
భూసురులకు భక్తి వొలుపొంద నగునె?
యురవడిచేసి భక్త్యుదేకములను
బరమార్థ మెడలంగఁ బలికె నా వలదు ;
ఇది శ్రుతిస్మృతిమూలమేకాని యొండు
[1] పదకవాదం బని భావింపఁ జనదు; 1010
కర్మమార్గం బగుఁగాక బ్రాహ్మ్యంబు
నిర్మలశివభక్తి నిష్టితం బగునె ?
ఇట్టి బ్రాహ్మణమార్గ మిది దథ్యముగను
బట్టి యాడెద వేని పనియు లే దింకఁ ;
గాకులు వెంచిన కోకిలపిల్ల
కాకులఁ బోలునే కావుకా వనుచు;
నెక్కడితల్లి మీ రెక్కడితండ్రి
ఎక్కడితోడు ధర్మేతరులార !
చెన్నయ్య మాతాత చేరమ తండ్రి
పిన్నయ్య కక్కయ్య బిడ్డ నే ననుచు 1020
వేడుక సద్భక్తి విధి నుండువాఁడ ;
నేడుగడయు మాకు నిది నిక్కువంబు ;
మీయంత నుండుఁడు మీరును, నేను
నాయంత నుండెద వేయును నేల ?"

—: బసవేశ్వరుని పెండ్లి :—


యనుచు సహోదరి యగు నాగమాంబ
యును దాను నచ్చోట నుండఁ గా దనుచు
నరుదెంచె మఱి [2] ఫణిహారియింటికిని
నరు లిది సోద్య మనంగ నంతటను
వడుగున కని మున్న వచ్చినయతఁడు
పడఁతి మాదాంబకు భ్రాత సజ్జనుఁడు 1030

  1. వ్యర్ధవాదము.
  2. (ఆయూరియందలి) శివాలయమునకు.