పుట:Dvipada-basavapuraanamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

బసవపురాణము

పాండురాంగుని భక్తిపరుఁడు బిజ్జలుని
బండారి బలదేవదండనాయకుఁడు
“శివభక్తునకుఁ బెండ్లి సేయదుఁగాని
భవికి నీ" ననుతొంటిబాసఁ దలంచి
“ఇట్టిభక్తున కిప్పు డీక నాకూఁతు
నెట్టివానికి నిత్తు నింక నే" ననుచు
బసవకుమారునిపాలికిఁ బోయి,
యెసక మెసఁగ గూఁతు నిచ్చి తా మ్రొక్కి
“నా బిడ్డఁ జేకొని నన్ను రక్షింప
వే బసవన్న ! మాహేశ్వరతిలక !" 1040
యనుచుఁ బ్రార్థన చేసి యాబసవయ్య
యనుమతంబునఁ బుర మభిరమ్యముగను
మకరతోరణములు మణితోరణములు
ముకరతోరణములు మును గట్టఁ బనిచి,
"గలయంగ వీథులఁ గస్తూరి యలుకుఁ
డెలమి ముక్తాఫలంబుల మ్రుగ్గు లిడుఁడు,
రండు, భక్తులఁ బిలువుండు. మీ రెదురు
వొండు వేగమ తోడి తెండు తెం" డనుచు
విట వచ్చునయ్యల కెదురు వచ్చుచును
నట వచ్చునయ్యల కర్ది మ్రొక్కుచును 1050
సింహాసనస్థులఁ జేసి, యాకర్మ
సంహారమూర్తుల చరణము ల్గడిగి,
యవిరళనవ్యపుష్పాంజలు లిచ్చి,
ప్రమిమలధూపదీపంబు లొనర్చి,
యమ్మహాత్ములకు సాష్టాంగుండై యాక్ష
ణమ్మ విభూతి వీడ్యమ్ము లర్పించి
కోలాటమును బాత్ర గొండ్లి పేరణియుఁ
గేళిక జోకయు లీల నటింపఁ
బాయక "చాఁగు! బళా!" యను శబ్ద
మాయతి నాకసం బంది ఘూర్ణిల్ల 1060